కిరాతక తండ్రికి తల్లి వత్తాసు..!

Update: 2015-05-25 07:04 GMT
సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన అది. ఒక బాలికపై అత్యాచారం చేసి.. ఆమెను హత్య చేశారనే వార్తే చాలా మందిని బాధపెట్టింది. ఇదేం దారుణమనే బాధకలిగింది. ఈ సంఘటనపై శరవేగంగా విచారణ పూర్తి చేసిన పోలీసులు నిందితుడు తండ్రేనని స్పష్టం చేస్తున్నారు. కన్నకూతురు అని కూడా చూడకుండా పాపపై అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు కేసు పూర్వపరాలను వెలుగులోకితీసుకొచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.

    తెలంగాణలోని వికారాబాద్‌ ప్రాంతంలో గిరిజన యువతిపై జరిగిన హత్యాచారం కేసు వివరాలు ఇవి. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఈ సంఘటన సంచలనంగా మారింది. హత్యాచారం జరిగింది గిరిజన యువతిపై కావడంతో ఈ సంఘటనకు జాతీయ వ్యాప్తంగా కూడా ప్రచారం లభించింది. మీడియా సంస్థలు ఇలాంటి సంఘటనలపై తీవ్ర ఆవేదనే వ్యక్తపరిచాయి.

    అసలు వాడు మనిషేనా.. అంటూ బాలిక తండ్రిని తిట్టుకొనేవాళ్లు కనిపిస్తున్నారిప్పుడు. జంతువు కన్నా దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని ఏం చేసినా పాపం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంఘటన విషయంలో సమాజమంతా ఇలా స్పందిస్తూ ఉంటే.. బాలిక తల్లి మాత్రం భర్తను వెనుకేసుకు వస్తోంది!

    తన భర్త అమాయకుడు అని పోలీసులే.. అతడిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆమె అంటోంది. మరి ఆమెది అమాయకత్వం అనుకోవాలేమో! పోలీసులు మాత్రం ఆ తండ్రే దోషి అని స్పష్టం చేస్తున్నారు. అతడికి గత నేరచరిత్ర కూడా ఉందని వారు తేల్చి చెబుతున్నారు.


Tags:    

Similar News