సింహాచలం ఆస్తులపై బాంబు పేల్చిన మంత్రి
రాజులు రాజ్యాలు సంపాదించిన ఆస్తులన్నీ ప్రభుత్వాల పరం అయ్యాయి. అయితే దేవుడి పేరిట రాసిన భూములు కొన్ని కబ్జా కాగా.. మరికొన్ని ఆ దేవాలయాల పేరిటే ఉన్నాయి. దేవుడి ఆస్తులను చాలా మంది బడా రాయుళ్లు, రాజకీయ నేతలు అన్యాక్రాంతం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఉత్తరాంధ్రలోనే పేరొందిన సింహాచలం దేవస్థానం భూముల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద బాంబు పేల్చారు. వందల ఎకరాలు రికార్డుల నుంచి తారుమారు అయ్యాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఎవరికీ తెలియకుండా చాలా ఆస్తులు అమ్మేశారని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని.. లోతైన విచారణ జరుగుతోందని మంత్రి వెల్లంపల్లి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఇంకా సంచలన విషయాలు బయటపెడుతానని మంత్రి అంటున్నాడు.
ఇప్పుడు మంత్రి బయటపెట్టే ఆ సంచలనాలు ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఈ సందర్భంగా నాడు నేడూ సింహాచలం దేవస్థాన చైర్మన్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆస్తులను కాపాడలేకపోయారని మంత్రి విమర్శించారు.
ఇక సింహాచలం ఆస్తుల విషయంలో ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవని మంత్రి వెల్లంపల్లి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి అశోక్ గజపతిపై మరో వివాదం మోపం చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయినట్టుగా మంత్రి మాటలను బట్టి తెలుస్తోంది.