నిమ్మగడ్డనే కావాలట.. పెద్దిరెడ్డి పట్టు

Update: 2021-03-16 14:02 GMT
ఏపీలో స్థానిక సంస్థల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు.. ఏపీలోని జగన్ సర్కార్ కు ఎంత పెద్ద యుద్ధం నడిచిందో అందరం చూశాం. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో జరిగింది. జగన్ కు మద్దతుగా పెద్దిరెడ్డి ఫైట్ చేయడం.. ఆయనను బయటకు రాకుండా నిమ్మగడ్డ నిషేధం విధించడం జరిగిపోయింది. ఒకనొక దశలో నిమ్మగడ్డపై నిప్పులు చెరిగారు పెద్దిరెడ్డి. కానీ ఇప్పుడు దిగిపోతున్న నిమ్మగడ్డను వింత కోరిక కోరాడు పెద్దిరెడ్డి. వైసీపీ విజయోత్సవాల్లో ఆ కాగల కార్యాన్ని కూడా పూర్తి చేయాలని కోరడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వెంటనే జరపాలని మంత్రి పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయ అవరోధాలు తొలిగినందున వెంటనే ఎన్నికలు పెట్టాలని కోరారు.ఇక ఇన్నాళ్లు ఎస్ఈసీ నిమ్మగడ్డతో కయ్యం పెట్టుకున్న ఏపీ మంత్రి పెద్ది రెడ్డి తాజాగా ఈ ఎన్నికలను కూడా పూర్తి చేసి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేయాలని సూచించడం విశేషం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి కేవలం 6 రోజులు చాలని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలంటే ఎన్నికలు పూర్తి కావాలని పెద్ది రెడ్డి స్పష్టం చేశారు.అయితే ఈ ప్రతిపాదనకు నిమ్మగడ్డ అంగీకరిస్తారో లేదో చూడాలి. ఇప్పటికే జగన్ సర్కార్ ఆయనను కోరగా..తాజాగా సెలవుల్లో వెళ్లడానికి రెడీ అయ్యారు. మరి పెద్దిరెడ్డి కోరికను నిమ్మగడ్డ మన్నిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News