వన్ అండ్ ఓన్లీ విశాఖ...ధర్మాన చెప్పేది ప్రభుత్వం మాటేనా...?
ఏపీలో మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్ ని 2020లో వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చినపుడు అంతా కొత్తగా చూశారు. అసలు ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యంగా కూడా చూశారు. వింత ప్రతిపాదన అని కూడా అనుకున్నారు. దాని మీద చర్చోపచర్చలు జరిగాయి. ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటి అని కూడా విమర్శించారు.
అయితే మూడు రాజధానుల విషయం మీద మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశ్యాలు ఏంటి అన్నది ఆందులోనే సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు చెబుతున్న దానిని బట్టి చూస్తే పక్కాగా అర్ధమవుతుంది. నిజానికి దేశంలో కొన్ని రాష్ట్రాలలో హై కోర్టులు ఒక చోట సచివాలయం మరో చోట ఉన్నాయి. అంతమాత్రం చేత అన్నింటినీ రాజధానులుగా చెప్పడంలేదు. ఎక్కడైతే పాలన సాగుతుందో దాన్నే రాజధానిగా గుర్తిస్తున్నారు.
ఒడిషాలో భునవేశ్వర్ లో సచివాలయం ఉంటుంది, కటక్ లో హై కోర్టు పెట్టారు. దాంతో భునవేశ్వర్ మాత్రమే రాజధాని అయింది. అదే ఏకైన క్యాపిటల్ గా దేశమంతా గుర్తిస్తోంది. ఇపుడు అలాంటి ఆలోచనతోనే వైసీపీ ఉందని ధర్మన వారి మాటలను బట్టి అర్ధమవుతోంది. ఆయన గత కొన్ని రోజులుగా ఇదే రకమైన వాదనతో ముందుకు సాగుతున్నారు. మొదటి సారి ఆయన ఏకైక రాజధాని విశాఖ అని అన్నప్పుడు అందరూ దానిని ఒక సంచలన వార్తగా చేశారు.
అయితే ఆయన ఇపుడు పదే పదే అదే అంటున్నారు. దానికి ఆయన చెప్పిన లాజిక్ కూడా వైసీపీ ఆలోచనలను తెలియచేస్తోంది. శాసనసభ ఒక చోట పెట్టినా అది ప్రజలకు సంబంధం లేనిది. పైగా ఏడాదిలో మూడు సార్లు మాత్రమే అసెంబ్లీ జరుగుతుంది. ఇక కర్నూల్ లో హై కోర్టు ఉన్నా కక్షిదారులు తప్ప ఆ వైపు వెళ్లేవారు లేరు. కానీ నూటికి నూరు శాతం మంది జనాలకు సచివాలయంతో సంబంధం ఉంటుంది.
అలా కనుక చూస్తే ఎక్కడ సచివాలయం ఉంటుందో ఎక్కడ పాలన సాగుతుందో అదే మనకు అసలైన ఏకైక రాజధాని అవుతుంది అని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఆయన ఇంకో మాట అన్నారు. మిగిలిన రెండింటినీ రాజధాని అనడానికి కారణం వారిని సంతృప్తి పరచడానికి మాత్రమే. అంటే రాజధాని ఒక్కటే అని వైసీపీ కూడా ఫిక్స్ అయిపోయింది.
అదే విశాఖపట్నం అని కూడా క్లారిటీగా ఉంది. రాజధాని విషయంలో మూడు ఎందుకు అంటున్న నేపధ్యంలో లేక విభజన చట్టంలో ఒక్కటే రాజధాని ఉండాలని కనుక నిబంధన ఉన్న పక్షంలో వైసీపీ కూడా ఒక్కటే రాజధానికి జై కొడుతుంది. ఆ ఒక్క రాజధాని విశాఖ అవుతుంది. ఇదే ధర్మాన వారు చెబుతున్న మాట.
సీనియర్ మంత్రిగా ఆయన ఇదే వాదనను జనంలోకి తీసుకెళ్తున్నారు. అంతే కాదు విశాఖ వంటి నగరానికే రాజధాని అర్హత ఉందని కూడా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మూడు రాజదానులు అని ప్రభుత్వం మొదట చెప్పకుండా ఉండి ఉంటే ఇది రాజకీయ రాద్ధాంతం అయ్యేదే కాదు అన్న వారూ ఉన్నారు.
అయితే ప్రభుత్వానికి ఇవన్నీ తెలిసినా కూడా ప్రాంతీయ సెంటిమెంట్ కోసం రాజధానులు అన్ని చోట్లా అని ఊదరగొట్టింది. చివరికి ఆ వ్యూహం బెడిసికొట్టి అసలుకే ఎసరు వస్తున్న వేళ మెల్లగా ధర్మాన లాంటి వారి చేత ఒక్కటే రాజధాని అదే విశాఖ అని చెప్పిస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఏది ఏమైనా సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని మీద కేసు నడుస్తోంది. ఆ విచారణను బట్టి వచ్చే తీర్పుని బట్టి ప్రభుత్వం కీలక నిర్ణయం ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెబుతూ వచ్చే ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంప్ ఆఫీస్ విశాఖకు షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.