అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్.. పాతబస్తీలో బిర్యానీ ఫైట్

Update: 2022-09-29 10:29 GMT
హైదరాబాద్ పాతబస్తీ.. అక్కడికి ఒకప్పుడు పోలీసులు కూడా వెళ్లేందుకు భయపడేవారు. అంతలా వారి ఆధిపత్యం ఉండేది. అల్లరి మూకల దాడులు, ప్రతిదాడులు, గ్యాంగ్ వార్ లతో అట్టుడికేది. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులన్నీ సద్దుమణిగి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.

అయితే అల్లరి మూకల ఆగడాలు తగ్గాయనకుంటున్న సమయంలో మరోసారి పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టించింది. బిర్యానీ విషయంలో ఓ వక్తి ఏకంగా  తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకూ హోటల్ తెరిచి ఉంచాలో చెప్పాలని అడిగారు.

దీనికి మహమూద్ అలీ స్పందిస్తూ.. 'నేను హోంమంత్రిని.. నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ..' అర్ధరాత్రి ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి బిర్యానీ విక్రయాల కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్ సీపీని కలిశారు. మరోవైపు అర్ధరాత్రి వరకూ బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు అంటున్నారు.

కాగా ఈ బిర్యానీ కోసం కొందరు అల్లరిమూకలు ఎగబడడంతో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బిర్యానీ హోటల్ యజమానులు పోలీసుల బాస్ అయిన తమకు పరిచయమైన మహమూద్ అలీకి ఫోన్ చేసి ఇలా కోరినట్టు తెలుస్తోంది. పరిచయం ఉండబట్టే ఫోన్ చేశారని.. దీనిపై అలీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News