ఒమిక్రాన్ విజృంభిస్తే పరిస్థితి అంత దారుణంగా మారుతుందట
అక్కెడక్కడో సౌతాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్.. మన ముంగిట్లోకి వచ్చేసింది. చైనాలోని వూహాన్ మహానగరంలో మొదలైన కరోనా మహమ్మారి.. రోజుల వ్యవధిలోనే మన దేశాన్నితాకటం.. ఆపై చుట్టేయటం ఎలా జరిగిందో.. ఒమిక్రాన్ విషయంలో కాస్తంత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త వేరియంట్ భారీగా విస్తరిస్తే.. దేశానికి జరిగే నష్టం భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేలా వైద్య యంత్రాంగం సమాయుత్తం కావాలని రాష్ట్రాలకు సూచించారు.
ఇప్పటికే కరోనా మొదటి.. రెండో వేవ్ తో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఆ మాటకు వస్తే.. అప్పుడు జరిగిన నష్టం నుంచి నేటికి కోలుకోని రంగాలు చాలానే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఉపాధి అవకాశాల్ని కోల్పోయిన వారు నేటికి తేరుకున్నది లేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి ఒమిక్రాన్ కేసులు దేశాన్ని చుట్టేస్తే చోటు చేసుకునే నష్టం అంతా ఇంతా కాదు.
ఇలాంటి వేళలో.. ఒమిక్రాన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. గడిచిన రెండేళ్లుగా కరోనా దెబ్బకు భయం భయంతో బతుకుతున్న వారు.. ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి బయటకు వస్తున్నారు. మరికొందరు ఈ భయంతో మరెంత కాలం బతకాలన్న ఫస్ట్రేషన్ తో బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏమైనా.. బయటకు రావటం.. పెద్దఎత్తున ప్రయాణాలు చేయటం ఈ మధ్యన ఎక్కువ అయ్యింది. ఇలాంటివేళ.. ఒమిక్రాన్ రూపంలో మరో ముప్పుపొంచి ఉంది. దీన్ని తేలిగ్గా తీసుకోకుండా.. జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
కొన్ని సంస్థల అంచనా ప్రకారం ఫిబ్రవరి రెండో వారానికి ఒమిక్రాన్ కేసులతో దేశంలో థర్డ్ వేవ్ పెద్ద ఎత్తున ఉంటుందని చెబుతున్నారు. గడిచిన వారంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. అంత టైం తీసుకోదని.. మరికాస్త ముందే వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. మరిన్ని జాగ్రత్తలు పాటించకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.