పాక్‌తో మ్యాచ్ రద్దు చేయాలి..కేంద్రమంత్రి డిమాండ్
ఇండియా.. పాకిస్ధాన్ ను శతృదేశంగా భావిస్తుండడంతో ఆ దేశంతో జరిగే ఎలాంటి పరిణామైన కాస్త వివాదాస్పదాల దారి తీస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ ఈవెంట్‌లో ఈ నెల 24న పాక్,భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా అనేక వివాదాలు ముందుకు వస్తున్నాయి. కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండియా- పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాక్ ప్రేరిపిత ముష్కరుల చర్యల కారణంగా కశ్మీర్ లో ఆశాంతి నెలకొందని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా, లేదా అనే సందేహాం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
సరిహద్దుల్లో పాకిస్థాన్ దుశ్చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం ఈ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నాడు. తాజాగా మరో కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సైతం పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానెల్ తో మాట్లాడిన అథవాలే.. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానన్నాడు. 'ప్రస్తుతం కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ ఆగడాలను అణిచివేసేందుకు భారత ప్రభుత్వం ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలి. పాక్ తో మంచి సంబంధాలు కొనసాగించాలని భారత ప్రభుత్వం, ప్రధాని భావిస్తున్నప్పటికీ.. వారి ఉగ్ర చర్యలు ఆగడంలేదు.
ఆ దేశంపై అంతిమ యుద్ధం ప్రకటించాలి. ప్రస్తుతం పాక్ తో టీ20 మ్యాచ్ ను నిలిపివేయాలి. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తా' అని పేర్కొన్నారు. పాకిస్థాన్ తో మ్యాచ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాయాదీ దేశంతో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా నిరాకరించాలని ఆప్ మహిళా ఎమ్మెల్యే అతిషీ కోరారు. భారత్ లో పాక్ ఉగ్రదాడులు ఆగిపోయేంతవరకు ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ లు ఆడకూడదని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన డిమాండ్‌కు మద్దతిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ మెగా మ్యాచ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించాడు. ఉగ్రవాదుల దాడులను ఖండించిన అతను.. మ్యాచ్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశాడు. ‘‘జమ్మూ కశ్మీర్‌లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఐసీసీకి ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం.. ఏదేని ఒక జట్టుతో మేము మ్యాచ్ ఆడలేమని తిరస్కరించే వీలులేదు. ఐసీసీ టోర్నమెంట్‌లో కచ్చితంగా ఆడాల్సిందే'' అని స్పష్టం చేశారు.