ఇమ్రాన్ సర్కార్ పై పాక్ విపక్షాల మూకుమ్మడి దాడి !

Update: 2020-10-19 12:30 GMT
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా , విపక్ష పార్టీలన్ని కూడా ఏకమైయ్యాయి. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు  ఈ పోరాటం ఆపకూడదని  నిర్ణయం తీసుకున్నాయి.పాక్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌ మెంట్‌- పీడీఎం పేరుతో ఏర్పాటైన విపక్ష కూటమి ఆదివారం   కరాచీ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీలో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులంతా ఇందులో పాల్గొన్నారు. ఒకే వేదికను పంచుకొని , ఇమ్రాన్ ‌ఖాన్ ‌పై విమర్శలు గుప్పించారు.

ఇమ్రాన్ఖా న్‌ అంతటి అసమర్థుడైన ప్రధానిని తాము ఇంతవరకు చూడలేదని, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా పాపం ఆయనకు తెలియడం లేదని పాక్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ, గతంలో  నియంతలకు ఏ గతి పట్టిందో ప్రధాని ఇమ్రాన్ కి  కూడా అదే గతి పడుతుందని తెలిపారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం కూడా  ఈ ఆందోళనలో పాల్గొన్నారు. లండన్ ‌లో ఉంటున్న నవాజ్‌ అనారోగ్య కారణాల వల్ల క్రియాశీలక రాజకీయాలలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. దీనితో ప్రస్తుతం పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ పార్టీని ముందుండి నడుపుతున్నారు మరియం. తన తండ్రి, తన పార్టీ మద్దతుదారులను ఇమ్రాన్‌ దేశద్రోహులని అనడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేఖించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని , పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నా సోదరి ఫాతిమా జిన్నాను కూడా ఇమ్రాన్‌ దేశ వ్యతిరేకులనడం ఆయనకే చెల్లిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదీ సక్రమంగా చేయడం లేదని, అవినీతి రాజ్యమేలుతోందని మరియం విమర్శించారు. 2007లో జరిగిన జంట పేలుళ్లలో మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో మరణించి ఆదివారానికి 13 సంవత్సరాలు అయ్యింది. అందుకు గుర్తుగా ఈ భారీ ర్యాలీని నిర్వహించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ను పదవిలోంచి తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న 11 ప్రతిపక్ష పార్టీలు పీడీఎం పేరుతో ఏకమైయ్యాయి.
Tags:    

Similar News