క్షమాపణలు చెప్పిన మార్క్ బౌచర్ ..ఎందుకు !
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ క్షమాపణలు చెప్పాడు. బౌచర్ ఆటగాడిగా ఉన్న సమయంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆ జట్టు మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఆరోపించిన నేపథ్యంలో బౌచర్ స్పందించాడు. క్రికెట్ సౌతాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కు సమర్పించిన అఫిడవిట్‌లో బౌచర్, తన మాజీ సహచరులకు క్షమాపణలు చెప్పాడు. బౌచర్ క్రికెటర్ గా ఉన్నప్పుడు ఇతర ఆటగాళ్లపై అభ్యంతరకర పాటలు పాడేవాడని, నిక్ నేమ్స్‌తో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసేవాడని ఆడమ్స్ ఆరోపించాడు.
విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు క్రికెట్ ఆడుతున్న సమయంలో బౌచర్ నల్లజాతీయ సహచరులను ఉద్దేశించి పాటలు పాడి, వారిని మారుపేర్లతో పిలిచి అవమానించాడు. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ పాల్ అడమ్స్, తాను జాతి వివక్షకు గురయ్యానంటూ ఆరోపణలు చేశాడు. ఈ అంశానికి సంబంధించి బౌచర్ 14 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని దక్షిణాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీకి సమర్పించాడు.
ఆరోజుల్లో నేను నల్లజాతీయులపై ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నా, ఆరోజు నేను ఆరోపణలు చేసినవారిలో పాల్ అడమ్స్ కూడా ఉన్నాడు. అడమ్స్ ను మారుపేరుతో పిలుస్తూ పాటలు పాడాను. ఇది బాధాకరం, ఈ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. ఏది ఏమైనా నా అమర్యాద ప్రవర్తనకు క్షమాపణలు చెబుతున్నా. ఆ కాలంలో జట్టు, సహాయ సిబ్బంది, సెలక్టర్లు, సీఎస్ ఏ మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. జట్టు సభ్యులందరూ స్వేచ్చగా మాట్లాడే వాతావరణం కల్పించాల్సింది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మార్క్ బౌచర్ దక్షిణాఫ్రికా తరపున 147 టెస్టుల్లో 5515 పరుగులు, 295 వన్డేల్లో 4686 పరుగులు, 25 టీ20ల్లో 268 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ గా 532 క్యాచ్ లు.. 555 స్టంపింగ్స్ చేశాడు. 2012లో సోమర్ సెట్ తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ బెయిల్ కంటికి తగలడంతో దురదృష్టవశాత్తూ ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బౌచర్ సౌతాఫ్రికా క్రికెట్ ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.