పాపాల పుట్ట పగిలింది.. నాసిక్ టీసీఎస్ టీం లీడర్ల నీచాలు బయటకు

ఇప్పటివరకు చర్చకు రాని కార్పొరేట్ జిహాద్ ఐటీ కంపెనీలో.. అందునా టీసీఎస్ లాంటి కంపెనీలో వెలుగు చూసిన వైనం నోటి వెంట మాట రాని విధంగా మారటం తెలిసిందే.;

Update: 2026-04-17 08:18 GMT

ఇప్పటివరకు చర్చకు రాని కార్పొరేట్ జిహాద్ ఐటీ కంపెనీలో.. అందునా టీసీఎస్ లాంటి కంపెనీలో వెలుగు చూసిన వైనం నోటి వెంట మాట రాని విధంగా మారటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కలకలాన్ని రేపిన నాసిక్ టీసీఎస్ టీం లీడర్ల దురాగతాలు అంతకంతకూ వెలుగు చూస్తున్నాయి. వారు చేసే నీచ చేష్టలకు అండగా హెచ్ ఆర్ మేనేజర్ గా వ్యవహరించిన మరో ముస్లిం మహిళను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మహిళలే బాధితులుగా బయటకు రాగా.. తాజాగా పురుష ఉద్యోగులు తమకు ఎదురైన చిత్రహింసల్నిబయటపెడుతున్నారు. తాజాగా ఒక ఉద్యోగి పోలీసులకు తనకు ఎదురైన చిత్రహింసల్ని వెల్లడించటంతో ఈ ఉదంతం మరో మలుపు తిరిగినట్లైంది.

వర్కు ప్లేస్ లో సున్నితమైన వ్యక్తిగత భావాలపై దాడులు చేయటం.. మతం మారాలని ఒత్తిళ్లకు గురి చేయటం.. ముస్లిం టోపీ ధరించాలని ఒత్తిడి చేయటంతో పాటు..కల్మా పఠించాలంటూ వేధింపులకు గురి చేసిన దురాగతాలు ఇప్పుడు వెలుగు చేశాయి. తాజాగా ఈ క్యాంపస్ లోని ఉద్యోగి ఒకరు పోలీసులకు తనకు ఎదురైన చిత్రవధను పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీం లీడర్ గా వ్యవహరించిన తౌసిఫ్ అక్తర్ పై అతను ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని అంశాల్ని చూస్తే.. నోటి వెంట మాట రాని పరిస్థితి. ఇంతటి నరకమా? అంటూ విభ్రాంతికి గురి కావటం ఖాయం.

తమకు చాలా కాలంగా పిల్లల్లేరని.. ఒకసారి తమ వైవాహిక జీవితం గురించి తౌసిఫ్ అక్తర్ ఆరా తీశాడని పేర్కొంటూ.. ‘‘నీ భార్యను నా దగ్గరకు పంపించు. నిన్ను తండ్రిని చేస్తా అంటూ అశ్లీలంగా మాట్లాడాడు. అక్కడే ఉన్న తోటి ఉద్యోగి డానిష్ షేక్ సైతం అదే తరహాలో మాట్లాడాడు. దీనిపై గొడవ జరగ్గా.. కోపంతో తౌసిఫ్ టేబుల్ ఫ్యాన్ ను నాకు తగిలేలా విసిరికొట్టాడు. చంపేస్తానని బెదిరించాడు. దీనిపై హెచ్ఆర్ కు కంప్లైంట్ చేశాను. ఆ తర్వాత దాని గురించి నేను మర్చిపోయినా.. వాళ్ల వేధింపులు ఆగలేదు. హెడ్డాఫీసుకు నాపై వ్యతిరేక రిపోర్టులు పంపేవారు. మతం మారాలని ఒత్తిడి తెచ్చినా నేను మతం మారలేదు’’ అంటూ తనకు ఎదురైన నరకాన్ని పేర్కొన్నాడు.

వారి మాటల్ని తాను వినకపోవటంతో తౌసిఫ్ టీం అకారణంగా తనను వేధింపులకు గురి చేసేవారన్న సదరు ఉద్యోగి.. ముస్లిం టోపీ ధరించి ఆఫీసుకు రావాలని..కల్మా పఠించాలని.. నమాజ్ చేయాలన్నఒత్తిడికి గురి చేసేవారన్నారు. తన తోటి మహిళా ఉద్యోగి ఒకరు తౌసిఫ్.. డానిష్ ల దారుణాల గురించి చెప్పి.. కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. ‘‘వాళ్లు ఎవరైనా ఉద్యోగిని టార్గెట్ చేస్తే.. సదరు మహిళా టెకీలను ఆఫీసు పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఆఫీసులోనే ఉంచేసి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు’’ అని పేర్కొన్నారు. ఇ

దిలా ఉండగా.. మరో మహిళా ఉద్యోగి హెచ్ ఆర్ మేనేజర్ తీరుపైనా ఫిర్యాదు చేశారు. తాను కంప్లైంట్లు చేస్తే హెచ్ ఆర్ తీసుకునేవారు కాదని.. తనను ఆఫీసులోని చివరి అంతస్తులో పని చేయించేవారని.. ఆ సందర్భంగా తన వద్ద ఫోన్.. బ్యాగ్ కూడా ఉండనిచ్చేవారు కాదన్నారు.తమలోని పాతికేళ్ల లోపు మహిళల్ని లక్ష్యంగా చేసుకునేవారన్నారు. అయితే.. ఈ కార్పొరేట్ జిహాద్ వ్యవహారం మొత్తం సంస్థ ఉన్నతాధికారులకు తెలీకుండా జరిగినట్లుగా సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో నాసిక్ టీసీఎస్ ఆఫీసు కార్యకలాపాల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అందులో పని చేసే వారందరికి వర్కు ఫ్రం హోం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు వేధింపు ఆరోపణలున్న ఆరుగురు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్టు చేయగా.. హెచ్ ఆర్ మహిళా ఉద్యోగి మాత్రం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News