హార్లే డేవిడ్సన్ బైక్ తో ట్రయల్ అన్నాడు అంతే..

Update: 2015-09-01 16:30 GMT
మోసాలు రోజు రోజుకీ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఈ విషయంలో ఎవరిస్థాయిలో వారు క్రియేటివిటీ చూపించేస్తున్నారు. "దొరకను" అనుకోవడమే ఆలస్యం.. దొంగవతారం ఎత్తేస్తున్నారు.. దొంగతనం చేసేస్తున్నారు. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలియదు కానీ... సులువు గా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 2 లోని ఒక బైక్ షోరూం లో జరిగిన సంఘటన దీనికి తాజా ఉదాహరణ.

బంజారాహిల్స్ లోని హార్లే డేవిడ్సన్ షోరూం కి కాస్త అటుఇటుగా పాతికేళ్ల వయసున్న యువకుడు వచ్చాడు. మాంచి టిప్ టాప్ గా తయారయ్యి, జేబునిండా క్రెడిట్ కార్డులు పెట్టుకుని.. తాను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని అని పరిచయం చేసుకున్నాడు. అంతేనా... తనకు అక్షరాలా లక్షన్నర జీతం అని చెప్పుకున్నాడు. అనంతరం సుమారు ఆరు లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ బైక్ స్ట్రీట్ - 750 మోడల్ బైక్ కొంటానని బేరమాడాడు. షాపు వారు పూర్తిగా నమ్మారని నమ్మకం వచ్చాక... ట్రైల్ వేస్తానని బైక్ తీసుకుని వెళ్లాడు. వెళ్లడమే.. ఇంక తిరిగిరాలేదు. ఎప్పటికో గాని అసలువిషయం అర్ధం కాని షోరూం యజమాని... తేరుకుని.. పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇచ్చాడు. ప్రస్తుతం సీసీ టీవీ ఫుటేజ్ ఆదారంగా యువకుడి ఊహాచిత్రాన్ని గీసేపనిలో పడ్డారు పోలీసులు!
Tags:    

Similar News