విడిపోయిన భర్త నుంచి సంతానం కావాలట!

Update: 2019-06-24 07:35 GMT
వాళ్లిద్దరూ భార్యభర్తలుగా కొంత కాలం పాటు జీవించారు. ఒక పాప కూడా పుట్టింది. విబేధాలతో విడిపోయారు. కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. అందుకు సంబంధించి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో విడాకుల కోసం దరఖాస్తులో భాగస్వామి అయిన ఆ మగువ ఒక ఆసక్తిదాయకమైన పిటిషన్ దాఖలు చేశారు. విడిపోయిన తన భర్త ద్వారా తనకు సంతాన ప్రాప్తిని కలిగించాలని ఆమె కోర్టును కోరి ఆశ్చర్యపరిచారు.

తను తన భర్త నుంచి వాస్తవానికి విడిపోవాలని కోరుకోవడం లేదని - కలిసి ఉండాలనేదే తన అభిమతమని ఆమె అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తనకు సంతానం కావాలని ఆమె కోరారు. సహజమైన పద్ధతిలో సంసారం చేసి లేదా - కృత్రిమ పద్ధతిలో అయినా తనకు సంతానం కలిగించాలని ఆమె తన భర్తను కోర్టు ద్వారా కోరారు. మహారాష్ట్రలోని ఒక ఫ్యామిలీ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు అయ్యింది.

ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమె పట్ల కొంత సానుకూలంగా స్పందించింది. కృత్రిమ పద్ధతిలో సంతానం గురించి ఫ్యామిలీ కౌన్సిలర్ ను - వైద్యులను కలవాలని కోర్టు సూచించింది. అయితే ఆమె భర్త మాత్రం దీనికి నో అని అంటున్నాడు. తను భార్య నుంచి విడిపోయిన నేఫథ్యంలో ఆమెకు మళ్లీ సంతాన ప్రాప్తికి అతడు నో అంటున్నాడు. దీని వల్ల సామాజికంగా సంతానానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అతడు వాదిస్తున్నాడు. ఆమె కోరికా అర్థవంతంగానే ఉంది - అతడి వాదనలోనూ నిజముంది!
Tags:    

Similar News