మాటల యుద్ధం: మహారాష్ట్ర సీఎం - గవర్నర్ డిష్యూం.. డిష్యూం

Update: 2020-10-13 16:41 GMT
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. ఆలయాలు, ఇతర ప్రార్థన ఆలయాలను తెరిచే అంశంపై వాడీ వేడిగా మాటలు సంధించుకున్నారు.

సీఎం ఠాక్రేజీ ఒక్కసారిగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని ప్రార్థన ఆలయాలు తెరవడంపై గవర్నర్ వ్యంగ్యంగా స్పందించగా.. దానికి కౌంటర్ గా.. ‘నాకెవరు హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా సమాధానమిచ్చారు.

కరోనా కారణంగా దేశంలో ఆలయాలు, ప్రార్థన ఆలయాలు ఏడాది మార్చి నుంచి మూసివేశారు. ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగైన కారణంగా మహారాష్ట్రలో తెరవాలని గవర్నర్ కోశ్యారీ సీఎం ఉద్దవ్ కు సోమవారం లేఖ రాశారు.

ఈ సందర్భంగా సీఎం ఉద్దవ్ పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘బలమైన హిందుత్వ వాది మహారాష్ట్రలో ప్రార్థన మందిరాలను ఇంకా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని.. బార్లు, రెస్టారెంట్లు, బీచ్ లను తెరిచారు.దేవుళ్లను లాక్ డౌన్ లో ఉంచారు.. మీరే లౌకికవాదిగా మారారా?’ అంటూ గవర్నర్ లేఖలో ప్రశ్నించారు.

ఇందుకు సీఎం ఉద్దవ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘నాకెవరు హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెరిస్తే హిందుత్వవాది.. తెరవకపోతే లౌకికవాదా? భగవంతుడి నుంచి ఆదేశాలు మీకు వస్తాయోమో నాకు కాదు ’ అంటూ ప్రత్యుత్తరం రాసి కౌంటర్ ఇచ్చారు. ప్రజల మతవిశ్వాసాల కంటే తనకు వారి ప్రాణాలు రక్షించడమే ముఖ్యం అని.. లాక్ డౌన్ ఎత్తివేయడం సరైందని కాదని ఠాక్రే తెలిపారు.
Tags:    

Similar News