ఫ్రాంక్ ఫర్ట్ నుంచి సింగపూర్ ఫ్లైట్ లో మనోడు ఒక్కడే.. ఎందుకు?

Update: 2020-07-08 00:30 GMT
కలలో కూడా ఊహించని ఉదంతాలు కొన్ని భలేగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. చాలామందికి విమానం ఎక్కటమే ఒక కల. అలాంటిది ఒక విమానంలో ఒక దేశం నుంచి మరో దేశానికి.. అందునా ఆ ఫ్లైట్ లో తాను తప్పించి మరే ప్రయాణికుడు లేకపోవటాన్ని ఊహించగలమా? కలలో కూడా సాధ్యం కానిది తాజాగా రియల్ గానే మనోడు ఒకరు ఎంజాయ్ చేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

కేరళకు చెందిన ప్రతాప్ పిళ్లై మెరైన్ ఇండస్ట్రీలో పని చేస్తుంటాడు. లాక్ డౌన్ టైంలో సింగపూర్ నుంచి జర్మనీకి చేరుకున్నాడు. అనూహ్యంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అతగాడు జర్మనీలో ఉండిపోయాడు. వందే భారత్ మిషన్ లో భాగంగా అతను వచ్చేందుకు ఫ్లైట్ ఉన్నా.. అది ఢిల్లీ వరకే ఉంది. మళ్లీ అక్కడి నుంచి కేరళకు వెళ్లాల్సి ఉంటుంది.

దీంతో..మరో ఆప్షన్ ను ఎంచుకున్నాడు. అందులో ఫ్రాంక్ ఫర్ట్ నుంచి సింగపూర్ మీదుగా వెళితే.. అక్కడి నుంచి తన రాష్ట్రానికి వెళ్లే వీలుంది. దీంతో.. ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత విమానంలో సిబ్బంది మినహా మరెవరూ లేకపోవటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

అనంతరం తేరుకున్న అతడు.. తనకు లభించిన అరుదైన అవకాశాన్ని ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నారు. రాయల్ గా ఫీల్ అవుతూ ఆ జర్నీని ఎంజాయ్ చేసినట్లు చెబుతున్నాడు ప్రతాప్. మొత్తంగా కలలో కూడా ఊహించని రీతిలో రాజభోగాలు అనుభవిస్తూ ఒంటరిగా ఫ్రాంక్ ఫర్ట్ నుంచి సింగపూర్ కు చేరుకున్నాడు. ఏమైనా ఇలాంటివి కోట్లల్లో ఒక్కరికి మాత్రమే లభించే అరుదైన అవకాశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News