పార్కులు అయిపోయాయి .. ఇక రైళ్ళల్లోనే
ప్రేమకి వయస్సు తో పనిలేదు. ప్రేమ గుడ్డిది అని చాలామంది అంటారు. అప్పట్లో ఆలా ఎందుకు చెప్పారో తెలియదు కానీ ..ప్రస్తుతానికి మాత్రం అది బాగా సూట్ అవుతుంది. ప్రేమ గుడ్డిదే కావచ్చు కానీ , ప్రేమికులు గుడ్డివారు కదా. కనీసం మనం కూడా ఈ సమాజంలోనే బ్రతుకుతున్నాం అని మర్చిపోతే ఎలా? ప్రేమ పేరుతో ఒళ్ళు తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ రాసలీలలు కొనసాగిస్తూ ప్రేమ గుడ్డిదే అనే సామెతకి మరో సరికొత్త అర్థం చెప్తున్నారు.
ఒకప్పుడు ప్రేమ అంటే అంటే లైలా మజ్ను ..దేవదాసు పార్వతులు గుర్తుకు వచ్చేవారు. కానీ, ప్రస్తుతం ఆ టైప్ ప్రేమికులు ఉండటం దాదాపుగా అసంభవం. ప్రస్తుత యువత ప్రేమ బస్సులో మొదలై పార్కుల్లో ముగిసిపోతున్నాయి.అలాగే , ఈ మధ్య కాలంలో ప్రేమికుల వ్యవహారశైలి మరింత తీసికట్టుగా మారిపోయింది. రహస్య గదుల్లో వారిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన కొన్ని పనులని పబ్లిక్ లో కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా చేసేస్తున్నారు.
తాజాగా విశాఖ మీదుగా భువనేశ్వర్ వెళ‌్తున్న ఇంటర్ సిటీ రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. చుట్టూ ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని సైతం మరిచి, రైల్లోనే రాసలీలలు సాగించారు. ఇలాంటి పనులు చేయడం తప్పు అని చెప్పిన వారిపై దాడికి దిగడం గమనార్హం.విస్తుపోయే ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే .. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ ప్రేమ జంట ఏకంగా రైలు లో తమ ప్రేమలీలలు ప్రారంభించారు. చుట్టూ అందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టరీతిన ప్రవర్తించారు. ఇది చూసిన తోటి ప్రయాణికులు తప్పని వారించారు. అయినా కూడా వారిపైనే దాడికి ప్రయత్నించాడు. దీనితో అక్కడున్నవారంతా కూడా వారిని కొంచెం గట్టిగా మందలించి, ఇది మంచి పద్దతి కాడు అని చెప్పి వదిలేశారు.