మే 3 వరకు పొడగింపు ఎందుకు? కారణమేంటి?
మార్చి 21వ తేదీన లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మీడియా ముందుకు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన ప్రకటించిన మాదిరి మార్చి 22 నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగియనుంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండడం, పది వేల మార్క్ దాటడంతో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో అందరూ ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తారని అందరూ భావించారు. ఆ క్రమంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తామని ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి మరోసారి ఏప్రిల్ 14వ తేదీన మీడియా ముందుకు వచ్చి సంచలన ప్రకటన చేశారు. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
అందరూ ఊహించినట్టు ఏప్రిల్ 30 కాకుండా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలుస్తోంది. వాస్తవంగా ఏప్రిల్ 30వ తేదీతో లాక్‌డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అనంతరం ఆ తర్వాతి రోజులను పరిశీలించింది. అయితే మే 1వ తేదీ శుక్రవారం గమనించగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. అనంతరం మే 2వ తేదీ శనివారం.. ఇక ఆ తర్వాత మే 3వ తేదీ ఆదివారం వస్తుంది. 1వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం కూడా ఉంది. ఈ రెండింటి మధ్యలో శుక్రవారం ఒక్కరోజే ఉంది. ఒకవేళ లాక్‌డౌన్ ఏప్రిల్ 30వ తేదీతో ముగిస్తే ఆ తెల్లారే అంతర్జాతీయ సెలవు దినం ఉంది. ఆ రెండు రోజులకు ఆదివారం కూడా ఉంది. ఎందుకైనా మంచిదని ఆ మూడు రోజులను కూడా కలిపేసుకుని మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రాల అంగీకారంతోనే మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసి చివరకు లాక్‌డౌన్ పొడిగించింది. ఈ రెండో విడత లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తే ఇక కరోనా వైరస్ అనేది భారతదేశంలో అస్సలు కనిపించదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజలు లాక్‌డౌన్ సహకరించి ఇళ్లకే పరిమితం కావాలని ఈ సందర్భంగా సూచిస్తున్నారు.