లాక్ డౌన్ ఎఫెక్ట్ : డెలివరీ బాయ్స్‌ గా మారిపోయిన యువకులు .. ఫుడ్ తో పాటుగా !

Update: 2021-05-24 08:30 GMT
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ను అరికట్టడానికి విధించిన కరోనా లాక్ డౌన్ ను శనివారం నుంచి చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన వారిపై చెక్‌ పోస్టుల్లోని పోలీసులు  తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీనితో అనేక మంది యువకులు రోడ్డు పైకి రావడానికి పలు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ పాసులు, గడువు ముగిసిన లెటర్లు, పాత తేదీలతో ఉన్న మందుల చీటీలను చూపించి పోలీసులనే బురిడీ కొట్టిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ తరహాకు చెందిన ఉదంతాలు వందల సంఖ్యలో వెలుగు చూశాయి. ఈ ఘటనలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పాసులు, లెటర్లను చాలా స్పష్టంగా తనిఖీ చేస్తున్నారు.  ఎవరైనా దొంగ పాసులతో దొరికితే కేసులు నమోదు చేస్తున్నారు. చిలకలగూడ ప్రాంతానికి చెందిన ఓ చికెన్‌ షాపు నిర్వాహకుడు తన వాహనంపై ప్రెస్‌ అని రాయించాడు. ఇతడి వాహనాన్ని ఆపిన పోలీసులు గుర్తింపు కార్డు అడిగారు. అప్పుడు కానీ అతగాడు అసలు విషయం చెప్పలేదు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ప్రెస్‌ అని రాయించినట్లు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. గ్రేటర్‌ లో ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌ డౌన్‌ అమలవుతోంది.

ఈ నేపథ్యంలో అధికారులు అత్యవసర సేవలతో పాటు కీలకాంశాలకు సంబంధించి బయటకువచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.  అత్యవసర ప్రయాణాలు, వ్యవసాయ అవసరాలు, ఇతర తప్పనిసరి అంశాల కోసం పోలీసు వి భాగం ఈ పాస్‌ జారీ చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారు తెలిపిన కారణాలతో పాటు ఇతర పూర్వాపరాలు పరిశీలించి వీటిని ఇస్తున్నారు. ఈ పాస్‌లు తమకు రావని భావిస్తున్న వారితో పాటు సరదాగా బయట సంచరించాలనే ఉద్దేశంతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వాహనాలపై ప్రెస్‌ అని రాయించుకుంటున్నారు.  ఇంకొందరు ఆకతాయిలు వేరే వారికి జారీ చేసిన పాసుల్లో మార్పు చేర్పులు చేసుకుని తమ వాహనాలపై ఏర్పాటు చేసుకుని సంచరించే ప్రయత్నాలు చేస్తున్నారు.  వీరంతా ఒక ఎత్తయితే... డెలివరీ బాయ్స్‌ అవతారం ఎత్తుతున్న వారిది మరో ఎత్తు. ఫుడ్‌ తో పాటు ఈ–కామర్స్‌ డెలివరీ సంస్థలకు చెందిన టీ–షర్టులు వేసుకుని, ఏదో ఒక బ్యాగ్‌ పట్టుకుని శని, ఆదివారాల్లో అనేక మంది రోడ్డెక్కారు.  ఇలా అడ్డదారులు తొక్కుతూ శనివారం వందల సంఖ్యలో మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పా టు చేసిన చెక్‌ పోస్టుల్లో చిక్కారు. ఈ కారణంగానే డెలివరీ బాయ్స్‌ ను కూడా ఆపి తనిఖీ చేశారు.
Tags:    

Similar News