కొంచెం చూసుకోండమ్మా..భర్త లైవ్​ లో ఉండగా నగ్నంగా దూసుకొచ్చిన భార్య

Update: 2020-09-27 06:50 GMT
టీవీ నటుడు, జర్నలిస్ట్​  ఫాబియో పర్చాట్ ఇటీవల ఓ రాజకీయ నాయకుడితో సీరియస్​గా లైవ్​ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ‘పొలిటికల్ లైవ్’ అనే మినీ సీరిస్ కోసం మాజీ బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి గుయిల్హెర్మే బౌలస్‌ను మొబైల్ ద్వారా లైవ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఫాబియో మాంచి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓ పొలిటికల్​ లీడర్​కూడా అంతే ఊపుతో సమాధానం చెబుతున్నాడు. ఇంతలో ఓ షాకింగ్​ పరిణామం. సదరు జర్నలిస్ట్​ భార్య బాత్రూం నుంచి నగ్నంగా బయటకు వచ్చేసింది. తన భర్త లైవ్​లో ఉన్నప్పటికీ వెనకనుంచి వంగి వెళ్లింది. అయినప్పటికీ ఆమె లైవ్​లో నగ్నంగా కనిపించింది. దీంతో ఆ రాజకీయనాయకుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. సదరు జర్నలిస్ట్​గా కూడా బోరున నవ్వాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది.

‘మొగుళ్లు లైవ్​ ప్రొగ్రాం చేస్తున్నప్పుడు కాస్త చూసుకొని నడుచుకొండి తల్లీ’ అంటూ చురకలింటిస్తున్నారు నెటిజనులు. ఈ వీడియో ఇప్పటికే కొన్ని లక్షలవ్యూస్​ సంపాదించుకున్నది. తాను వంగి వెళుతున్నాను కాబట్టి  కెమేరాలో కనిపించనని ఆమె భావించి ఉండొచ్చు. కానీ ఇలా బుక్కయిపోతానని ఆమె ఊహించి ఉండదు. కరోనా ఎఫెక్ట్​తో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఇంట్లో నుంచే లైవ్​ వీడియోలు ఇవ్వడంతో ఈ మధ్య ఇటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్​ ఎక్కువగా జరుగుతున్నాయి. జాగ్రత్త లేకుంటే బుక్ అయిపోతాం. ఏది ఏమైనా ఇటువంటి వ్యవహారాలు సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండేవాళ్లకు మాంచి టైంపాస్​గా మారాయి.
Tags:    

Similar News