లక్ష్మీవిలాస్ ఎఫెక్ట్: ఏ బ్యాంకులో డబ్బు దాచుకోవాలి?

Update: 2020-11-20 23:30 GMT
కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో దాచుకంటే దొంగలపాలు.. బ్యాంకులో దాచుకుంటే నష్టాల పాలు.. ఇక షేర్లు, ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ మెంట్ వైపు చూస్తే సైబర్ నేరగాళ్ల బెడద ఉండనే ఉంది.. ఇలా డబ్బు ఎక్కడ దాచుకుందామనుకున్నా భయాందోళన వాతావరణం ఏర్పడుతోంది. ఇంతకీ   డబ్బు బ్యాంకులో దాచుకోవాలా..? వద్దా.. ? ఒక వేళ డిపాజిట్ చేయాలనుకుంటే ఎంత మొత్తంలో చేయాలి..? ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలి..? అనేది ఇప్పుడు సామాన్యులకు అంతుచిక్కడం లేదు..

ఇటీవల లక్ష్మీ విలాస్ బ్యాంకు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఖాతాదారుల డబ్బు విత్ డ్రాపై ఆర్బీఐ పరిమితులు విధించింది. గరిష్టంగా రూ.25000 వరకు మాత్రమే తీసుకోవచ్చని తెలిపింది. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పంజాబ్, మహారాష్ట్ర బ్యాంకులు సైతం ఇదే విధంగా నష్టాలపాలై ఖాతాదారులకు పరిమితులు విధించాయి.

ఇదిలా ఉండగా ఏదైనా బ్యాంకు నష్టానికి గురైతే ఆ బ్యాంకు నుంచి ఖాతాదారుడు రూ.5 లక్షలకు మించి తీసుకోరాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు వరకు మాత్రమే బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ పరిణామాలతో ఖాతాదారులు బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.  తాజాగా లక్ష్మీవిలాస్ బ్యాంకులో రూ.5లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారు తమ డబ్బును లాక్కొనేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.

దీంతో అసలు బ్యాంకులో డబ్బు దాచుకోవాలా..? వద్దా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో కొందరు బ్యాంకు నిపుణులు తమ సొమ్మను ఎక్కువ మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చంటున్నారు. అయితే అది ప్రభుత్వ బ్యాంకు అయితే బెటరని సూచిస్తున్నారు. ఎక్కువ వడ్డీకి ఆశపడి ప్రైవేట్ బ్యాంకుల జోలికి పోకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేసినా తమ మొత్తాన్ని ప్రభుత్వం నుంచైనా చెల్లించే అవకాశం ఉంది.

ఇక ఒక బ్యాంకులో ఎక్కువమొత్తాన్ని ఉంచకుండా రెండు, మూడు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మంచిదంటున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పేర్లమీద డిపాజిట్లను విభజిస్తే ఒక వేళ బ్యాంకు నష్టానికి గురైనా మనీ సేఫ్ గా తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
Tags:    

Similar News