తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు.. సమైక్యవాదాన్ని బలంగావినిపించిన ఏపీ నేతల్లో లగడపాటి పేరు టాప్ ఫైవ్ లో ఒకరు. ఆయన నోటి నుంచిసమైక్యవాదం తప్పించి మరో మాట వచ్చేది కాదు. అంతేనా.. విభజన బిల్లు లోక్సభకు వచ్చిన వేళ.. పిప్పర్ స్ప్రేను ప్రయోగించి.. దేశ వ్యాప్తంగా సంచలనంసృష్టించిన వైనాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు. రాష్ట్రం కానీ రెండు ముక్కలు కానీ అయ్యిందా.. నేను రాజకీయాల్ని వదిలేస్తా.. రాజకీయ సన్యాసం చేస్తానని ప్రతిన పూని మరీ.. రాజకీయాలకు దూరమైన నేతగా లగడపాటిని చెప్పుకోవాలి.
పాలిటిక్స్ లో ఉండనని చెప్పిన ఆయన.. ఎన్నికల సమయంలో మాత్రం ప్రెస్ మీట్ పెట్టి.. మీడియా సంస్థలకు పోటీగా తనదైన సర్వే ఫలితాల్ని చెబుతుంటారు. ఆయన సర్వేలకున్న ఇమేజ్ ఎంతంటే.. ప్రముఖ మీడియా సంస్థలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో.. లగడపాటి సర్వే ఫలితాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి. ఇలా.. చిత్రమైన ఎన్నో విశేషాల సమాహారమైన లగడపాటికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి తాజాగా వార్తల్లోకి వచ్చింది.
ఆయన ఇద్దరు కుమారులకు పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇరువురు కొడుకులకు ఒకేసారి ఎంగేజ్ మెంట్ చేయాలని డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. ఆయన ఇద్దరి కొడుకుల పేర్లను చూస్తే.. ఒకరి పేరు అశ్రిత్ అయితే.. మరొకరు ప్రణయ్ లు. ఇద్దరి ఎంగేజ్ మెంట్ లు .. హైదరాబాద్ లోని ఈ నెల 26న పార్క్ హయత్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.
పెళ్లికూతుళ్లలో ఒకరు కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి దానం నాగేందర్ బంధువుగా తెలుస్తోంది. మరో పెళ్లికుమార్తె పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని చెబుతున్నారు. పెళ్లికుమార్తెలకు సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/