పూరన్ ఫుల్ షో.. పంజాబ్ హ్యాట్రిక్.. గబ్బర్ శతకం వృథా

Update: 2020-10-21 04:30 GMT
మరోసారి శిఖర్ ధావన్ గర్జించాడు. ఆట మొదలైన మొదటి ఓవర్ నుంచి  చివరి ఓవర్ దాక క్రిజ్ లో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కి గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే పంజాబ్ జట్టులో నికోలస్  పూరన్, క్రిస్ గేల్ మెరుపు ఇన్నింగ్స్ తో పంజాబ్ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది.దీంతో ఏడింట ఆరు మ్యాచ్ లు ఓడి సంక్లిష్టంగా మారిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ధావన్ సెంచరీ వృథా అయ్యింది.టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ లో  శిఖర్ ధావన్ ఆటే హైలెట్. ధావన్‌ (61 బంతుల్లో 106 నాటౌట్‌) అద్భుత సెంచరీతో పోరాటం చేశాడు. పృథ్వీ షా (7), కెప్టెన్‌ అయ్యర్‌ (14), పంత్‌ (14), స్టొయినిస్‌ (9), హెట్‌మైర్‌ (10) వరుసగా విఫలం చెందారు. అందరూ ప్రత్యర్థి బౌలింగ్‌ కు తలవంచారు.

ఛేదన లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్‌ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్‌ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనా ధన్ ఇన్నింగ్స్ తో పంజాబ్‌ హ్యాట్రిక్ విజయం అందుకుంది. రాహుల్‌ (15) పరుగులకే ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన  గేల్‌ తనదైన శైలిలో ఉతికి ఆరేసాడు. తుషార్‌ వేసిన ఐదో ఓవర్‌లో  గేల్‌ వరుసగా  4, 4, 6, 4, 6 బాదేయడంతో  26 పరుగులు వచ్చాయి.

మయాంక్‌ (5) ఔట్ అయినా పూరన్‌ అర్ధసెంచరీతో పాటు చివర్లో  మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 32; 3 ఫోర్లు), హుడా (22 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్‌), నీషమ్‌ (8 బంతుల్లో 10 నాటౌట్‌; సిక్స్‌) పరుగులు చేయడంతో పంజాబ్ విన్ అయ్యింది.

మలుపు తిప్పిన 4వ ఓవర్

ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌కి రాగా క్రిస్‌గేల్ భారీ సుడిగాలి సృష్టించాడు.తొలి రెండు బంతుల్ని ఫోర్లు కొట్టినగేల్ ఆ తర్వాత మళ్లీ సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టేశాడు.  తుషార్ ఆరో బంతిని వైడ్ వేయగా చివరి బంతికి గేల్ సింగిల్ తీశాడు. మొత్తంగా.. ఆ ఓవర్‌ లో 4, 4, 6, 4, 6, వైడ్, 1 రూపంలో మొత్తం 26 పరుగులు వచ్చాయి. దీంతో  సాధించాల్సిన రేట్ ఒక్కసారి ఓవర్‌ కి 10.0 నుంచి 7.0కి పడిపోయింది.


రికార్డులు కొల్లగొట్టిన ధావన్

ఈ మ్యాచ్ లో అద్భుత సెంచరీ తో ధావన్ పలు రికార్డులు నమోదు చేశాడు.టి20 క్రికెట్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలు చేసిన తొమ్మిదో క్రికెటర్‌ గా నిలిచాడు. గతంలో వార్నర్‌ (2011), ఉన్ముక్త్‌ చంద్‌ (2013), ల్యూక్‌ రైట్‌ (2014), మైకేల్‌ క్లింగర్‌ (2015), పీటర్సన్‌ (2015), మార్కో మరైస్‌ (2018), రీజా హెండ్రిక్స్‌ (2018), ఇషాన్‌ కిషన్‌ (2019) కూడా ఈ ఘనత సాధించారు.

ఒకే టోర్నీ లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్‌ ధావన్‌. బెంగళూరు తరపున 2016లో కోహ్లి నాలుగు సెంచరీలు  చేశాడు. గేల్‌ (2011-బెంగళూరు), ఆమ్లా (2017-పంజాబ్‌), వాట్సన్‌ (2018-చెన్నై) రెండు సెంచరీల చొప్పున చేశారు.
Tags:    

Similar News