బాబు ఇలాకాలో వైసీపీ నేత హత్యకు కుట్ర.!
అది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా ‘కుప్పం’. టీడీపీకి పెట్టని కోట..పోయిన ఎన్నికల్లో చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టి దాదాపు ఓడించినంత పనిచేసింది వైసీపీ. కుప్పంలో చంద్రబాబుకే సవాల్ చేసేలా వైసీపీ నేతలు ఎదుగుతున్నారు.
అయితే ఇదే కుప్పంలో తాజాగా వైసీపీ నేత విద్యాసాగర్ రావు హత్యకు వేసిన స్కెచ్ బయటపడడం సంచలనంగా మారింది. ఆయన హత్యకు ప్లాన్ చేసిన దుండగులు ఏకంగా పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్ కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోవడం కలకలం రేపింది.
ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ హత్య కుట్ర బయటపడింది.
పోలీసులు విచారించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ హత్యకు కుట్రపన్నిన వారి కోసం సమాచారం సేకరిస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా వైసీపీ నేత హత్యకు ప్లాన్ చేయడం కలకలం రేపింది. కుప్పంలో పోయినసారి చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిపోవడంలో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన హత్యకు ప్లాన్ చేయడం చర్చనీయాంశమవుతోంది.