ముసలినక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు

Update: 2018-11-14 10:46 GMT
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రతిపక్షాలను తిడితే జనాలు ఫుల్ గా ఎంజాయ్ చేసేవారు.. అచ్చ తెలంగాణ యాస, భాషపై విపరీతమైన పట్టున్న కేసీఆర్.. తెలంగాణ జనాలకు వీనులవిందైన మాటలు మాట్లాడుతూ సెటైర్లు, పంచులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతుంటారు. కానీ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ కూడా ఈ గుణాలను బాగానే వంటిపట్టించుకున్నాడు.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో నిర్వహించిన ఆశీర్వాద సభలో కేటీఆర్ ప్రతిపక్షాలను ఏకిపారేస్తూనే తాను గతంలో సోనియాగాంధీని ఉద్దేశించి చేసిన ‘సోనియా అమ్మ బొమ్మ’ పదాన్ని ఊటంకించారు. సోనియాను బొమ్మ అన్నందుకు 5 ఫీట్లు ఉన్న కాంగ్రెసోళ్లు.. ఆరేడు ఫీట్లు ఎగిరి మరీ తన మీద మాటల దాడి చేశారని... గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న బాబు..  ఇటలీ మాఫియా.. ఇటలీ దెయ్యం అని సోనియాను అన్నాడని విమర్శించారు...  ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ సోనియాను తిట్టిన  బాబుతో ఎలా పొత్తుపెట్టుకుందని ఆయన ధ్వజమెత్తారు.  ముసలినక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబు ఒక్కటై తెలంగాణను దోచుకునేందుకు వస్తున్నారని మండిపడ్డారు..

తెలంగాణ ప్రాజెక్టులు కట్టకుండా కాంగ్రెస్ వాళ్లు కేసులు వేయించారని.. ఇదే చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏకంగా 30 ఉత్తరాలు రాశాడని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడీ ఇద్దరు  తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని ప్రజలను కేటీఆర్ కోరారు. రైతులు, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన కేసీఆర్ లాంటి సీఎం దేశంలోనే ఎవరూ లేరని కేటీఆర్ కితాబిచ్చారు..

ఇలా తండ్రిచాటు బిడ్డగానే కాదు.. తండ్రిని పోలిన విధంగా కేటీఆర్ జనసామన్యంలోని ఉదాహరణలు తీసుకొని రాజకీయ సభల్లో ఎండగడుతున్న తీరు జనాలను ఆకట్టుకుంటోంది.


Full View

Tags:    

Similar News