స‌మంత‌కు అన్యాయంపై కేటీఆర్ స్పందించాడు

Update: 2017-04-19 16:13 GMT
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌ గా సినీ నటి సమంతను ఎంపిక చేయ‌లేద‌నే వార్త‌లు ఇటు సినీ ప్ర‌పంచంలో అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడై మంత్రి కేటీఆర్ ద్వారానే స‌మంత చేనేత అంబాసిడ‌ర్‌ గా ఎంపిక‌య్యారు. అయితే తాజాగా స‌మాచార హక్కు చ‌ట్టం కింద చేసుకున్న ద‌ర‌ఖాస్తులో స‌మంతకు అలాంటి పద‌వి ఏమీ క‌ట్ట‌బెట్ట‌లేద‌ని అధికారికంగా క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగాడ‌ని స‌మాచారం.

చేనేత శాఖ అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్‌ ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ఒకింత క్లాస్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సాక్షాత్తు తాను ప్ర‌క‌టించిన నిర్ణ‌యానికే ఆచ‌ర‌ణ‌లో భిన్నంగా జ‌రిగితే ఎలా అని అధికారుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో చేనేత శాఖ డైరెక్ట‌ర్  శైలజా రామయ్యర్ ఓ ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. `` సుమారు నెల రోజుల క్రితం చేనేత రంగ అభివృద్ది- చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం తీసుకుని వచ్చేందుకు  ప్రముఖ సినీ నటి సమంత ముందుకు రావడాన్ని స్వాగతించిన మంత్రివర్యులు కే. తారక రామారావు గారు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌ గా గుర్తించి, గౌరవించి కృతజ్ఞ‌తలు తెలియజేయడమైనది. ముఖ్యంగా తనకు చేనేత వస్ర్త ఉత్పత్తుల పట్ల ఉన్న మక్కువ, ఆసక్తి వలన స్వచ్చందంగా టెస్కోతో కలిసి పని  చేస్తానన్న సమంతను తాము చేనేత బ్రాండ్ అంబాసిండర్ గా గుర్తించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణా ప్రభుత్వ అధ్వర్యంలో పని చేస్తున్న టెస్కో తరపున చేనేత బ్రాండ్ అంబాసిడర్‌ గా సమంత సేవలను వినియోగించుకుంటున్నాం. సమాచార సమన్వయ లోపం కారణంగా జరిగిన సినీ నటి సమంత చేనేత బ్రాండ్ అంబాసిండర్ కాదంటూ వార్త‌లు వ‌చ్చాయి `` అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.

అంతే కాకుండా ఈ సంద‌ర్భంగా సమంత‌కు ప్ర‌శంస‌లు సైతం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.  తెలంగాణ చేనేత ఉత్పత్తులకు విశిష్ట ప్రాచుర్యాన్ని మరియు అమ్మకాలను ప్రోత్సహించడానికి స‌మంత‌ ప్రతిఫలం ఆశించ‌కుండా సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలోని పలు చేనేత వస్ర్త తయారీ ప్రాంతాలను సందర్శించి, పరిస్ధితులపైన అధ్యాయనం చేశారు. చేనేత వస్ర్తాలకు ప్రాచుర్యం తెచ్చేందుకు, డిజైనింగ్ - మార్కెటింగ్ వంటి రంగాల్లో తన అలోచనలు స‌మంత మాతో పంచుకున్నారు. బ్రాండ్ అంబాసిడ‌ర్ విష‌యంలో త్వ‌ర‌లోనే అధికారికంగా సమంతాతో ఒక అవగాహన‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం`` అని చేనేత శాఖ ప్ర‌క‌ట‌న వివ‌రించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News