మోడీ ఎమెర్జెన్సీ ట్వీట్‌కి కేటీఆర్ రెస్పాన్స్ ఏంటంటే..?
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నిండి నలభై ఏళ్లు అయిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ట్వీట్ చేయటం తెలిసిందే. సదరు ట్వీట్‌లో కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడటం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని ఉక్కపాదంతో అణిచివేసిందంటూ మోడీ వాపోయిన ట్వీట్‌కు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి సమయానుకూలంగా తనకు అనుగుణంగా మార్చుకున్నారు.
ఆ ట్వీట్‌కు రిట్వీట్ ఇస్తూ.. ''గౌరవనీయులైన ప్రధానమంత్రిగారు.. 40 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కను ఉల్లంఘిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివేకవంతంగా వ్యవహరిస్తారని.. చరిత్ర పునరావృతం కాదని ఆశిస్తున్నా'' అంటూ టైమ్లీకిగా స్పందించారు కేటీఆర్. అయితే.. సెక్షన్ 8 అన్నది విభజన చట్టంలోనే ఉందన్న విషయాన్ని కోట్ చేయకుండా.. కేటీఆర్ చేసిన ట్వీట్‌పై ప్రధాని మాటల్లో స్పందిస్తారా? లేక చేతల్లో చూపిస్తారా? అన్నది చూడాలి.