కేసీఆర్ పేరు మార్చిన కేటీఆర్
గులాబీ దళపతి - తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆయన తనయుడు కేటీఆర్ కొత్త పేరు పెట్టారు. విపోఆలపై విరుచుకుపడటం - ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఈ మేరకు కొత్త సూత్రీకరణ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు ఏనాడూ ఆత్మగౌరవంతో పని చేయలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆంధ్రా నాయకుల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం పెదవులు మూసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నాయకుల నిర్వాకం వల్లే తెలంగాణ నష్టపోయిందన్నారు. సిగ్గు లేకుండా పదవులు పట్టుకొని వేలాడారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం నోట్లో మళ్లీ మట్టి కొట్టేందుకు మహాకూటమి రూపంలో వస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాలు తీరాయని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదనీ - కే-అంటే కాలువలు - సీ-అంటే చెరువులు - ఆర్-అంటే రిజర్వాయర్లని మంత్రి కొత్త నిర్వచనం ఇచ్చారు. ``ఎల్లారెడ్డిలో పెద్దగా పరిశ్రమలు లేవు. వ్యవసాయాధారిత ప్రాంతం. సస్యశ్యామలం చేసుకునే ప్రాంతం ఇది. సమైక్యాంధ్రప్రదేశ్ లో ఈ నియోజకవర్గానికి నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఈ ప్రాంతాన్ని మరో కోనసీమగా తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 200 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంటింటికీ తాగునీరు - ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తే తమ కిందికి నీళ్లు వస్తాయని భావించి.. కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేశారు`` అంటూ విరుచుకుపడ్డారు.
డిసెంబర్ 11న కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష వరకు రుణమాఫీ చేయబోతున్నామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మోడీని కలవడానికి ఢిల్లీకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ చెబుతున్నారనీ - ఇప్పుడు మోడీ జపాన్ లో ఉన్న విషయం కూడా తెలియని తెలివితక్కువ దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని కేటీఆర్ విమర్శించారు. మోడీ - రాహుల్ గాంధీ - చంద్రబాబు ఎవరైనా సరే తాము భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో బాసులు ఉన్నారనీ - తమకు మాత్రం తెలంగాణ గల్లీల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ``కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు అందరికీ తెలుసు. 2009లో తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆరు గంటల కరెంట్ ఇచ్చారు. ఇది కూడా ఒకేసారి ఇవ్వలేదు. కరెంట్ కోసం ఆనాడు నానాతిప్పలు పడ్డారు. ధర్నాలు చేసే పరిస్థితి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు పథకం అమలు చేశాం. రైతుబీమాతో వారి కుటుంబాల్లో భరోసా నింపాం` అని కేటీఆర్ స్పష్టం చేశారు.