హరీశ్ తో ఆ ప్రమాదం లేదంటున్న కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ కుటుంబంలో రాజకీయ వారసత్వ కుంపటి రగులుతుందన్న వార్తలపై ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి కే తారక రామారావు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వారసత్వ వివాదం ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఆయన కొందరు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన మేన బావ - మంత్రి హరీశ్ రావు గురించి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ మంత్రి అయ్యాక.... ప్రజలతో పెద్దగా టచ్ లేదని అందుకే సభలు పెడుతున్నానని వివరించారు. తన సభలు గిట్టని కొందరు హరీష్ రావు - తన మధ్య విబేధాలు సృష్టిస్తున్నారని తెలిపారు. అయితే తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని కేటీఆర్ తెలిపారు.
ఇటీవలి కాలంలో తాను వరుసగా సభలు పెట్టడం - అదే సమయంలో హరీష్ రావు ఇంటర్వ్యూ ఇవ్వడం యాదృచ్చికమేనని కేటీఆర్ చెప్పారు. వారసత్వం విషయంలో చుక్కెదురు అయితే హరీష్ రావు కాంగ్రెసులోకి వెళ్ళనున్నారనే వార్తలను కేటీఆర్ కొట్టిపారేశారు. తమ మధ్య మంచి అవగాహన ఉందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.తనకు ఇప్పుడే సీఎం అవ్వాలన్న కోరిక లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మరో పదేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారని ప్రకటించారు. రాజకీయాల్లో 64 ఏళ్లు అనేది యుక్తవయస్సని పేర్కొంటూ కేసీఆర్ ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ అంటే జనానికి మొహం కొట్టిందని తెలిపారు. తమకు ప్రత్యామ్నాయమే లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో సిద్దిపేటలో కూడా సభ పెట్టనున్నట్లు ప్రకటించారు. దేశంలో-రాష్ట్రంలో కాంగ్రెస్ కు దిక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త రాష్టాలు ఏర్పడ్డాక ఉన్న అస్థిరత తెలంగాణలో లేదని కేటీఆర్ వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం మైనార్టీ లకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వటం తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు కూడా 6 నెలల్లో రిజర్వేషన్ పెంచుతామని కేటీఆర్ ప్రకటించారు. ఎవరొచ్చినా తమకు ఎదురులేదని చెప్పారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, సవాళ్లు అదిగమించామని తెలిపారు. ప్రతిపక్షాలు వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షాలకు ఎలాంటి ఏజెండా లేదని కేటీఆర్ చెప్పారు.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. నిర్ణిత గడువు కంటే ముందే ఎన్నికల కోసం బీజేపీ కూడా చూస్తోందని కేటీఆర్ విశ్లేషించారు. అందులో భాగమే తెలంగాణలో పాగా కోసం ప్లాన్ వేస్తున్నదని తెలిపారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు ఎలక్షన్ వచ్చినా సరే అని స్పష్టం చేశారు. గుజరాత్‌లో కూడా గెలుస్తామనే పూర్తి నమ్మకం బీజేపీకి లేదని. అందుకే నిన్న భారీ ర్యాలీ లతీశారని కేటీఆర్ విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/