కేటీఆర్ కూలీ...25 నిమిషాల్లో 7.30 లక్షలు

Update: 2017-04-14 13:39 GMT
25 అయిదు నిమిషాల్లో 7.30 ల‌క్ష‌లు సంపాదించారా? ఎలా...ఏంటా మ‌హ‌త్యం. మంత్రి కాబ‌ట్టి ఎవ‌రైనా కానుక‌గా ఇచ్చి ఉంటారేమో అనుకోకండి. అదేం కాదు. కేటీఆర్ క‌ష్ట‌ప‌డి సంపాదించారు. ఏం క‌ష్టం అంటే...ఐస్‌ క్రీంలు అమ్మ‌డం. ఏంటి ఐస్‌ క్రీంలు అమ్మితే ఏడు ల‌క్ష‌ల‌కు పైగా సంపాదనా? అని సందేహం వ్య‌క్తం చేయ‌కండి. అవును. పూర్తి న్యాయ‌బ‌ద్దంగా ఆయ‌న ఈ మొత్తం సంపాదించారు.

టీఆర్ ఎస్‌ కూలీ దినాల్లో భాగంగా  కొంపల్లిలోని ఓ ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌ లో కేటీఆర్ ఐస్‌ క్రీమ్‌ అమ్మి ల‌క్షా 30 వేల రూపాయ‌లు సంపాదించారు. ఒక ఐస్‌ క్రీమ్‌ కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా,  స్థానిక నేత శ్రీనివాస్‌ రెడ్డి మరో ఐస్‌ క్రీమ్‌ కు రూ.లక్ష చెల్లించారు. అలాగే కేటీఆర్‌ స్వయంగా జ్యూస్‌ అమ్మారు. ఈ విషయాన్ని ఎంపీ మల్లారెడ్డి మీడియాకు వివరించారు. అనంత‌రం కుత్బుల్లాపూర్‌ లో కేటీఆర్‌ జ్యూస్‌ - ఐస్‌ క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్‌ గా పనిచేశారు.

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గులాబీ కూలీ దినాలుగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 21న టీఆర్‌ ఎస్ ప్లీనరీని అదేవిధంగా 27వ తేదీన వరంగల్‌ లో భారీ బహిరంగ సభ సందర్భంగా  కార్యకర్తలు - పార్టీ నేతలు శ్రమదానం చేసి ప్లీనరీ - బహిరంగ సభకు విచ్చేసే నిమిత్తం ఎవరి సొంత ఖర్చులకు వారే సంపాదించుకోవాలని సూచించారు. దీంతో మంత్రి కేటీఆర్‌ మరో రెండు రోజులు నగరంలో కూలీ పనులు చేయనున్నారు. ఇందులో మొద‌టి రోజే 7.30 ల‌క్ష‌లు సంపాదించేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News