జగన్ కు జోష్: బూస్ట్ ఇచ్చిన కేటీఆర్ వ్యాఖ్యలు
కరోనా వైరస్ ఇంకొంతకాలం.. ఉంటుంది.. దానితో మనం సహవాసం చేయాలని, -దానితో సహజీవనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాగా ట్రోలింగ్ అయ్యాయి. ముఖ్యంగా ప్రత్యర్థులు జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాకపోతే జగన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని పలువురు చెబుతున్నారు. జగన్ చెప్పిన మాటలు అంతర్జాతీయ - జాతీయ వైద్యులు - శాస్త్రవేత్తలు వాస్తవమని చెబుతున్నారు. తాజాగా ఆ మాటలను తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కూడా చెప్పారు. జగన్ చెప్పిన వాటినే తెలిపారు. దీంతో జగన్‌కు జోష్ రాగా.. ట్రోలింగ్ చేసిన వారికి షాక్ తగిలినట్టయ్యింది.
కరోనా వైరస్ పై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ తో కలిసి జీవించడం ప్రజలు ఎలాగో నేర్చుకోవాలని సూచించారు. వాస్తవాలను గ్రహించాలని స్పష్టం చేశారు. ఆ వైరస్ కు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేకపోవడంతో మరికొన్నాళ్లు మన మధ్యే ఉంటుందని తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ లేదా ఔషధం కనిపెట్టేంత వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. కరోనా వల్ల జీవితమా?… జీవనోపాధా? తేల్చుకునే పరిస్థితి రావొద్దని చెప్పారు.
కరోనా వైరస్ కట్టడి.. నివారణకు భారతదేశం అద్భుతంగా పని చేస్తోందని - భారత పనితీరును ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు. కరోనా ప్రమాదాన్ని ముందే గుర్తించి అప్రమత్తం కావడంతో ప్రవేశపెట్టిన లాక్‌డౌన్ కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే కరోనా నియంత్రించడంలో భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు. ఈ విధంగా జగన్ చేసిన వ్యాఖ్యలే కేటీఆర్ కూడా చేశారు. ఇన్నాళ్లు జగన్ వ్యాఖ్యలపై ట్రోల్ చేసిన వారు ఏమంటారని ఇప్పుడు వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.