గతం కాంగ్రెస్ ది..భవిష్యత్ టీఆర్ ఎస్ ది
తెలంగాణలో కాంగ్రెస్ దంతా గత చరిత్రేనని..భవిష్యత్ అంతా టీఆర్‌ఎస్‌దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీ అని, ఉద్యమంలో కలిసిరాని కాంగ్రెస్ నేతలు బంగారు తెలంగాణ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు అధోగతి పాలయ్యాయని, ఒక్క టీఆర్ ఎస్ మాత్రమే మిగిలిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దెబ్బకు చంద్రబాబు అన్నీ సర్దుకుని అమరావతి పారిపోయాడని ఎద్దేవా చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ ఎన్నోసార్లు చెప్పారన్నారు.
తెలంగాణలో టీడీపీ కథ ఇంతటితో ముగిసిపోయిందని కేటీఆర్ జోస్యం చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ ఆనాడే చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతిదానిలో కుంభకోణాలు చేశారని, ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశమంతటా కాంగ్రెస్ పార్టీ పతమైపోయిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అంటేనే దేశ ప్రజలు అసహ్యించుకుటున్నారని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. తాగు, సాగునీరివ్వకుండా కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారాలన్నదే సీఎం సంకల్పమని, కోటి ఎకరాలకు నీళ్లిస్తామంటే కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పెన్షన్ల కోసమే ఏడాదికి ఐదువేల మూడువందల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఒంటరి మహిళలకు కూడా వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సుమన్ తో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/