కేటీఆర్ జోస్యం వింటే షా ప‌రేషానే!

Update: 2018-11-04 05:47 GMT
శ‌త్రువులు మిత్రులు కావ‌టం.. స్నేహితులు సైతం ప్ర‌త్య‌ర్థులుగా మార‌టం రాజ‌కీయాల్లో మామూలే. తెలంగాణ‌లో తాను కోరుకున్న రీతిలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేలా చేయించుకోవ‌టంలో కేసీఆర్ మోడీ సాయం తీసుకున్నారంటూ జోరు ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు చేసిన సాయానికి బ‌దులుగా బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో ఒక‌టి మిన‌హా మిగిలిన స్థానాల్ని అభ్య‌ర్తుల ఎంపిక చేయ‌కుండా కేసీఆర్ త‌న‌దైన శైలిలో క‌మ‌ల‌నాథుల విష‌యంలో విధేయ‌త ప్ర‌ద‌ర్శించార‌న్న టాక్ ఉంది.

ఇదిలా ఉంటే.. మిష‌న్ 70 పేరుతో తెలంగాణ‌లో త‌మ గెలుపు ప‌క్కా అంటూ బీజేపీ నేత‌లు భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తుండ‌టం.. అందుకు త‌గిన‌ట్లుగా తాము వ్యూహాల్ని సిద్ధం చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని ఢిల్లీలోని షా మొద‌లుకొని గ‌ల్లీలోని క‌మ‌ల‌నాథుల వ‌ర‌కూ అంద‌రూ ఇదే మాట చెప్పేవారే.

ఇలా త‌మ మాట‌ల‌తో గులాబీ అధినాయ‌క‌త్వానికి తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లుగ‌జేస్తున్న బీజేపీపై తాజా మాజీ మంత్రి కేటీఆర్ క‌స్సుమ‌న్నారు. ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ ను ఓడిస్తామ‌ని.. 70 స్థానాల్లో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని అదే ప‌నిగా ప్ర‌చారం చేసుకుంటున్న బీజేపీ నేత‌ల‌కు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు కేటీఆర్‌. తెలంగాణ‌లో త‌మ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్న క‌మ‌ల‌నాథుల ఆశ‌ల మీద నీళ్లు కుమ్మ‌రించేలా ఆయ‌న వ్యాఖ్యానించారు.

మిష‌న్ 70 అంటూ బీజేపీ భారీగా ప్ర‌చారం చేస్తోంద‌ని.. దానికి త‌గ్గ‌ట్లే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా దిశానిర్దేశంలో పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్న వేళ ఆస‌క్తిక‌ర జోస్యాన్ని చెప్పుకొచ్చారు కేసీఆర్‌. రాష్ట్ర వ్యాప్తంగా 119 సీట్ల‌లో 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ గ‌ల్లంతు అవుతుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఆయ‌న‌.. గ‌తంలో బీజేపీ గెలుచుకున్న ఐదు స్థానాల్లో ఏ ఒక్క‌టి కూడా గెల‌వ‌దంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ అసెంబ్లీకి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేర‌న్న కేటీఆర్.. తెలంగాణ‌లో బీజేపీ మీద అస్స‌లు విశ్వాసం లేద‌ని తేల్చి చెప్పారు. ఇంత కాన్ఫిడెంట్ గా కేటీఆర్ చెబుతున్న జోస్యం గెలుపు మీద ధీమా ప్ర‌ద‌ర్శించే క‌మ‌ల‌నాథుల‌కు క‌రెంట్ షాకి్చ్చేలా ఉందంటున్నారు. దాన్లో నిజం ఎంత‌న్న‌ది తెలియాలంటే డిసెంబ‌రు రెండో వారం వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News