ట్వీట్ కు స్పందిస్తూనే.కాంగ్రెస్ కు కేటీఆర్ కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఓ ట్వీట్ కు స్పందిస్తూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ పై విపక్ష కాంగ్రెస్ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడాన్ని పురస్కరిస్తూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. `తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది పెద్ద ఎత్తున విద్యుత్ సమస్యలు ఎదురైతే...ప్రభుత్వం వైఫల్యం అని ప్రచారం చేశారు. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుంటే...ఇది తమ ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో మతలబు ఏంటి కేటీఆర్ సాబ్`అంటూ ప్రశ్నించారు.
దీనికి మంత్రి కేటీఆర్ ఒకింత ఘాటుగా స్పందించారు. ` కాంగ్రెస్ పార్టీ అనేది అవకాశవాదం - హిపోక్రసీ - నెగటివ్ పాలిటిక్స్ కలబోత. వాళ్లను అధికారానికి దూరంగా ఉంచాలి. ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు దేశాన్ని - రాష్ర్టాన్ని ఇలాంటి ఆలోచన దోరణితోనే పాలించారు. అయితే ఇప్పుడు ప్రజలు వారిని అధికారానికి దూరంగా పెట్టారు. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంచుతారని ఆకాంక్షిస్తున్నాను` అని స్పందించారు.
ఇదిలాఉండగా..కేసీఆర్ అనే పదానికి మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణాలో ప్రధాన నగరమైన కరీంనగర్ లో చేపట్టే అభివృద్ధి పథకానికి కేసీఆర్ (కరీంనగర్ సిటీ రినోవేషన్) అని పేరుపెట్టారు. రూ.250 కోట్లతో చేపట్టబోయే పనులు రేపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మౌళిక సదుపాయలు మెరుగుపర్చడంతో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాల్లో విస్తరించేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో భాగంగా కరీంనగర్ లో నిర్మించ తలపెట్టిన ఐటీ సెంటర్ కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వరంగల్ - ఖమ్మంలో ఐటీ హబ్ భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇదే వరుసలో నిజామాబాద్, మహబూబ్ నగర్ పట్టణాలు కూడా అతి తర్వలోనే చేరనున్నాయి.