కాంగ్రెస్‌ లోనే కోట్ల.. కథనాలన్నీ తూచ్‌

Update: 2015-04-09 12:53 GMT
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి టీడీపీలోకి రానున్నారని జోరుగా సాగుతన్న ప్రచారానికి ఒక్కసారిగా పుల్‌ స్టాప్‌ పడింది. విభజన తరువాత కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చాలామంది టీడీపీ, బీజేపీల్లో చేరగా ఇంకొందరు యాక్టివ్‌ గా లేకపోయినా కాంగ్రెస్‌ లోనే కొనసాగుతున్నారు. అలాంటివారిపై తరచూ రూమర్లు వస్తున్నాయి... టీడీపీలో చేరుతారని... బీజేపీలో చేరుతారని తరచూ ప్రచారం జరుగుతోంది. తాజా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి కూడా టీడీపీలో చేరుతారని రెండు రోజులగా ప్రచారం జరగింది. అయితే... ఆయన దీనికి వెంటనే పుల్‌ స్టాప్‌ పెట్టారు. తాను కాంగ్రెస్‌ లో నే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరతానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. అంతేకాదు... మీడియా సంస్థలు తమ వ్యాపారం కోసం ఏవేవో రాసేస్తున్నాయని అన్నారు.

    కాగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి కుటుంబంతో టిడిపి యువ నేత లోకేష్‌ మంతనాలు జరుపుతున్నారని.. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారని మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.  కోట్ల కుమారుడు రాఘవేంద్ర రెడ్డి తో లోకేష్‌ చర్చలు జరపగా సూర్య ప్రకాష్‌ రెడ్డి  ఒప్పుకోలేదని కథనాలు వచ్చాయి. వాటన్నిటినీ ఇప్పుడు సూర్యప్రకాశ్‌ రెడ్డి కొట్టిపారేశారు.

    టీడీపీలోకి వస్తే ఒక ఎంపీ సీటు, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని భరోసా ఇచ్చారని... రాష్ట్రంలో మంత్రి పదవి కూడా ఆఫర్‌ చేశారని కథనాలు వచ్చాయి... అయితే... తాజాగా కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి వీటిని కొట్టిపారేయడంతో ఇదంతా నిజం కాదనే అనిపిస్తోంది. ఇన్ని ఆఫర్లు ఇచ్చాక కాంగ్రెస్‌ ఇప్పుడున్న పొజిషన్లో ఏ నాయకుడైనా ఎట్రాక్టు కాకమానడు. కాబట్టి మీడియా కథనాలే అవాస్తవమన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News