నర్సాపురం కారం : ఇటు సుబ్బారాయుడు... అటు రఘురాముడు
ఉమ్మడి గోదావరి జిల్లాలను రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలుగా చెప్పుకుంటారు. ఇక్కడ జనాల తీర్పు మొత్తం రాష్ట్రానికి మార్గదర్శిగా ఉంటుందని కూడా అంటారు. ఇక పశ్చిమ గోదావరి వారి రాజకీయం ఎపుడూ రెండడుగులు ముందునే ఉంటుంది. అలాగే రాజకీయ పార్టీలు కూడా చాలా జాగ్రత్తగా గోదారి రాజకీయాల నాడి పట్టేందుకు చూస్తాయి.
ఇక పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకుంటే అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ప్రత్యేకించి సంఖ్యాబలంతో కాపులు, వ్యూహాలతో రాజులు ఈ జిల్లాను శాసిస్తూ వస్తున్నారు. ఈ రెండు సామాజికవర్గాలను దగ్గర తీసుకునే ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయాన్ని విజయవంతంగా చేసుకుంటూ పోతుంది.
అలాంటిది వైసీపీ మాత్రం ముందు ముందుగా క్షత్రియులతో పెట్టుకుంది. నర్సాపురం నుంచి గెలిచిన ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు తో వైసీపీ హై కమాండ్ కి విభేదాలు వచ్చాయి. దాంతో తొలి ఆరు నెలలలోనే ఆయన రెబెల్ అయ్యారు. గత రెండున్నరేళ్ళుగా ఆయన వైసీపీని మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు.
ఆయన ఎంపీ పదవికి ఢోకా లేదు, ఆయన ఢిల్లీ రచ్చబండ మీటింగులకు కూడా లోటు లేదు. ఇక రాజు గారు పంట్లో రాయిలా కాలికింద పల్లేరు ముల్లులా వైసీపీని నానా ఇబ్బందులు పెడుతున్నా కిమ్మనలేని పరిస్థితి. ఆయన పార్టీ హై కమాండ్ ని పట్టుకుని ఎన్నో రకాలైన మాటలు అంటున్నా కూడా ఆయన మీద కనీస చర్య వైసీపీ అధినాయకత్వం తీసుకోలేకపోయింది.
పైగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. ఆ విషయం పెండింగులో ఉంది. అది ఎపుడు తెములుతుందో తెలియదు. ఈ లోగా రాజుగారు మూడేళ్ళ ఎంపీగా పూర్తి చేశారు. మరో రెండేళ్ళలో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఒక విధంగా రాజు వారి విషయంలో వైసీపీ టోటల్ గా ఫెయిల్ అయిందని, నో యాక్షన్ అన్నట్లుగానే తీరు ఉందని అంటున్నారు.
ఇక ఇపుడు మాజీ ఎంపీ, సీనియర్ నేత, కొత్త పల్లి సుబ్బారాయుడు విషయానికి వద్దాం. ఆయన వైసీపీలో 2019 ఎన్నికల ముందు చేరారు. తనకు ఉన్న బలంతో అక్కడ వైసీపీని గెలిపించారు. ఆయన అనుకున్న విధంగా పార్టీ ఏమీ చేయలేదు అన్న భావన ఆయనలో ఉంది. అయితే ఆయన లోకల్ ఎమ్మెల్యే ప్రసాదరాజు మీద బాణాలు వేస్తూ వచ్చారు. హై కమాండ్ ని మాత్రం ఏమీ అనలేదని చెబుతున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో తాను నర్సాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని సుబ్బారాయుడు రెండు రోజుల క్రితం చెప్పారు. ఏ పార్టీ నుంచి అంటే అదే సస్పెన్స్ అని ట్విస్ట్ ఇచ్చారు. దాంతో ఆయన మీద క్షణాలలో యాక్షన్ కి వైసీపీ హై కమాండ్ రెడీ అయిపోయింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అవుతున్నారు.
తాను వైసీపీ హై కమాండ్ ని ఏమీ అనలేదని, తాను పార్టీ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించలేదని కూడా చెబుతున్నారు. తన మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు, ఏ నిబంధనల ప్రకారం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ చూస్తే ఒక్కటే కామన్ పాయింట్ ఉంది. నర్సాపురం అది. అలాగే ఇద్దరూ ఢక్కామెక్కీలు తిన్న నాయకులే. అందులో ఒకరు ఎంపీగా ఉంటూ వైసీపీని టార్గెట్ చేస్తూంటే ఇంకొకరు మాజీ ఎంపీగా ఉంటూ లోకల్ గా ఫైట్ చేస్తున్నారు. మరి రాజు గారిని వదిలేసి రాయుడు మీద యాక్షన్ ఆఘమేఘాల మీద తీసుకోవడమేంటి అన్న చర్చ వస్తోంది.
మొత్తానికి నర్సాపురం కాదు కానీ వైసీపీకి కంట్లో కారంగా మారింది అని అంటున్నారు. రాజు గారి మీద కోపం కూడా రాయుడు మీద ప్రతాపానికి కారణం అయిందా అన్న మాట కూడా వినిపిస్తోంది. రఘురాముడి మీద కూడా పార్టీ ఎందుకు ఈ తరహా యాక్షన్ తీసుకోలేకపోయింది అన్నది కూడా ప్రశ్నగా ఉంది. వైసీపీ మార్క్ చర్యలు కాదు కానీ అక్కడ ప్రధాన సామాజికవర్గాల మనసులు కెలికి వదిలిపెడుతోందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు లోతుగా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోవడంతో వైసీపీ తడబడుతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది.