• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ధరేమో ఎక్కువ.. ఆటేమో...

ధరేమో ఎక్కువ.. ఆటేమో తక్కువ.. ఆ ఫారిన్ ఆటగాడి పై కేకేఆర్ అసంతృప్తి

By - Tupaki Desk
Update: 2020-09-25 01:30 GMT
ఐపీఎల్  మొదలై 13 ఏళ్ళు అయింది. ఇందులో చరిత్ర చూస్తే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఎవరూ ఆయా సీజన్లలో రాణించింది లేదు. గతంలో గేల్, యువరాజ్ సింగ్, బౌలర్ ఉనాద్కత్, క్రిస్ లీన్ పేలవంగా ఆడారు. తాజాగా వీరి జాబితాలో ప్యాట్ కమ్మిన్స్ చేరారు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అతడు విరాట్ కోహ్లీ రూ. 17 కోట్లు తర్వాత  వేలంలో  రూ. 15.5 కోట్లు  పలికిన ఆటగాడు. టెస్టుల్లో నంబర్ వన్ అయిన ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని దక్కించుకునేందుకు చాలా జట్లు ప్రయత్నించగా..చివరికి  కోల్ కతా నైట్ రైడర్స్ రూ.15.5 కోట్ల భారీ మొత్తం చెల్లించి అతన్ని  సొంతం చేసుకుంది. జట్టులో బౌలింగ్  బలం అంత పటిష్టంగా లేకపోవడంతో అతనిపై యాజమాన్యం భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు తేలిపోయాడు.

 కొత్త కుర్రాడు శివ మావి వంటి  ఆటగాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్యాట్ కమ్మిన్స్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 49 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్ లో  రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఎడాపెడా బౌండరీలు బాదారు. కమ్మిన్స్ ఒక్కో ఓవర్ కు 16.3 చొప్పున పరుగులు  ఇచ్చాడు. ఆల్ రౌండర్లు, స్థానిక ఆటగాళ్ల స్థాయిలో కూడా ప్యాట్ కమ్మిన్స్ రాణించిక  పోవడంతో కోల్ కతా  నైట్ రైడర్స్ యాజమాన్యం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అంత భారీ స్థాయిలో అతని పై డబ్బుపెట్టి నష్టపోయామని భావిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడైనా అంతే. డబ్బు ఎక్కువ పోసిన ఆటగాళ్లు సక్సెస్ అయ్యింది తక్కువ. యువరాజ్ సింగ్  ను ఏకంగా బెంగళూరు రూ. 16 కోట్లు చెల్లించి తీసుకుంటే అతడు ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో మరుసటి ఏడాదే రాయల్స్ అతడిని వదులుకుంది. గేల్ విషయంలోనూ ఇలాగే  చేసింది బెంగళూరు. బౌలర్ ఉనాద్కత్ కూడా రూ. 13 కోట్లకు అమ్ముడు పోయినా ఐపీఎల్లో ఒక్కసారి కూడా ప్రభావం చూపింది లేదు. మెక్కల్లమ్, డివిలియర్స్, దినేష్ కార్తీక్ కూడా కొన్ని సీజన్లలో భారీ మొత్తంలో అందుకున్నా సరైన ప్రదర్శన చేసింది లేదు.
Tags:    
  • IPL 
  • IPL 2020 
  • IPL Matches 
  • IPL 2020 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS