ఖలిస్థాన్... స్వతంత్ర దేశం... ఏం జరుగుతోంది అసలు... ?
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్ళి అక్కడ సభలో పాల్గొనకుండానే తిరిగొచ్చారు. ఆయనను మధ్యలోనే ఫ్లై ఓవర్ మీద ఆపేసి ఆందోళనకారులు నిరసనలు తెలిపారు. ప్రాణాలతో తిరిగొచ్చాను మీ సీఎం కి థాంక్స్ అంటూ మోడీ ఆగ్రహంగా పంజాబ్ సీఎం మీద కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది భద్రతా వైఫల్యం అని బీజేపీ ఆరోపిస్తూంటే అది బీజేపీ నేతలు సింపతీ కోసం ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది.
ఇక దీని మీద సుప్రీం కోర్టులో వ్యాజ్యం కూడా దాఖలు అయింది. ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న అతి భారీ భద్రతా వైఫల్యం మీద సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు. దీని మీద చీజ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరపనుంది. మరో వైపు ఈ ఘటన మీద సమాధానం ఇవ్వాలని కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇంకో వైపు పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటన మీద విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ అయితే మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పంజాబ్ సర్కార్ ని ఆదేశించింది. ఇదిలా ఉండగానే ఈ అనూహ్య ఘటన తరువాత ఒక విచిత్రమైన డిమాండ్ బయటకు వచ్చింది. అదే ఖలిస్థాన్. ఈ దేశానికి ఇది కొత్త మాట కాదు, చాలా పాత మాటే. 1980 ప్రాంతంలో ఇది తరచుగా వార్తా పత్రికలలో వచ్చిన మాటే.
అవును సరిగ్గా ఇప్పటికి నలభై రెండేళ్ల క్రితం ఖలిస్థాన్ మాట వినిపించింది. నాడు శ్రీమతి ఇందిరాగాంధీ దేశానికి ముచ్చటగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఏలుబడిలో అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో పంజాబ్ లో అల్లర్లు మొదలయ్యాయి. అది కాస్తా చిలికి చిలికి గాలి వాన అయింది. దాని వెనక ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గమనించాయి. ఆ తరువాత దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో పడుతోంది అని గ్రహించి శ్రీమతి ఇందిరా గాంధీ 1984 జూన్ ప్రాంతంలో పంజాబ్ లోని స్వర్ణాలయం లో ఆపరేషన్ బ్లూ స్టార్ ని చేపట్టారు. అక్కడ దాక్కొన్న ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా ఖలిస్థాన్ నినాదానికి పూర్తిగా ఊపిరి తీశారు.
కానీ దానికి ఆమె తన జీవితాన్నే మొత్తం బలిపెట్టాల్సి వచ్చింది. అది జరిగిన నలుగు నెలలకు అంటే అక్టోబర్ 31న ఆమెను ఆమె అధికార నివాసంలోనే రక్షక భటులే దారుణంగా హత్య చేశారు. దాంతో దేశం నాడు అట్టుడికిపోయింది. ఇదంతా చరిత్ర. అయితే ఈ ఖలిస్థాన్ ఉద్యమం ఏంటి అంటే ఏకంగా దేశం నుంచి పంజాబ్ ని వేరు చేసి ప్రత్యేక దేశంగా ఆవిర్భివించడానికి ఉగ్రవాదులు పన్నిన పధకం.
నిజానికి ఈ దేశ విభజన జరిగినపుడు పాకిస్థాన్ తో పాటు పంజాబ్ లో కూడా ఇలాంటి వేర్పాటు వాద డిమాండ్లు వచ్చాయని చెబుతారు. అయితే నాటి దేశ నాయకులు అంతా సర్దుబాటు చేశారు. అయితే మూడు దశాబ్దాల తరువాత మళ్ళీ అదే వేర్పాటువాదం పురుడుపోసుకుంది. దాన్ని ఇందిరాగాంధీ అణచారు. ఇపుడు మళ్ళీ ఖలిస్థాన్ అంటూ వేర్పాటువాదులు నినదిస్తున్నారు.
భారతీయ జెండా చేపట్టి పంజాబ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని రాష్ట్రం వెలుపలే నిలువరించి తరిమికొట్టారు. ఇది ఖలిస్థాన్ స్వాతంత్రానికి నాంది అని సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గుర్ పత్వంత్ సింగ్ దీనిపైన తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇపుడు మంటలు పుట్టిస్తున్నాయి. మోడీని అడ్డుకున్న రైతులను ఆయన పొగుడుతూ ఖలిస్తాబ్ దేశాన్నిఏర్పాటు చేయడానికి ఇది నాంది అంటున్నారు. త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికలు ఖలిస్థాన్ ఏర్పాటుకు రిఫరెండం అని కూడా ఆయన అనడం సంచలనం రేపుతోంది. నిజానికి గత ఏడాది సాగు చట్టాల మీద రైతులు ఆందోళన చేపట్టిన సందర్భంలో కూడా ఖలిస్థాన్ మాట వినిపించింది. నాడు ఇంటలిజెన్స్ వర్గాలు రైతుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
అయితే నాడు విపక్షాలు రైతుల ఉద్యమాన్ని వెనకేసుకువచ్చి అలాంటిది లేదని అన్నారు. అయితే ఇపుడు చూస్తూంటే అది నిజమేనా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఖలిస్థాన్ ఉగ్ర మూకలు ఇతర దేశాలలో తిష్ట వేసి ఉన్నాయి. ఈ మధ్యనే పంజాబ్ లో జరిగిన భారీ బాంబు పేలుళ్ల వెనక కూడా ఉగ్రవాదుల హస్తం ఉందని అంటున్నారు మరో వైపు చూస్తే పాకిస్థాన్ కూడా ఉగ్రవాదులకు ఈ విధంగా చేయూతను ఇస్తోంది అన్న ఆరోపణలు ఉన్నాయి.
ఖలిస్థాన్ స్వతంత్ర దేశం అంటూ సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గుర్ పత్వంత్ సింగ్ చెప్పడాన్ని పెను ముప్పుగానే చూడాలి అంటున్నారు. నాడు ఆయుధాలతో వచ్చిన ఇందిరాగాంధీని అవే ఆయుధాలు సమాధానం చెప్పాయని, ఇపుడు రైతుల ఉద్యమాన్ని అణచిన మోడీకి కాలికి చెప్పులు లేని రైతులే నిరసన తెలియచేసి వెనక్కుపంపారని ఆయన అంటున్నారు. మోడీ పంజాబ్ లో అలజడి సృష్టిస్తున్నారని కూడా ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేయడం విశేషం.
ఖలిస్థాన్ కి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా సిక్కుల ఆయుధం ఖండాను ఎదుర్కోక తప్పదని గుర్ పత్వంత్ సింగ్ హెచ్చరించారు. మరి ఈ హెచ్చరికల వెనక ఉన్న కుటిల పన్నాగాలను బద్ధలు కొట్టాల్సిన అవసరం ఉంది. దేశ అంతర్గత భద్రతకు ముప్పు తెచ్చే శక్తులను ఉక్కు పాదంతో అణచివేయకపోతే దేశం ఇబ్బందులలో పడుతుందని మేధావులు అంటున్నారు. చూడాలి మరి కేంద్రం దీని మీద ఎలాంటి యాక్షన్ కి దిగుతుందో.