కరోనా నియంత్రణలో కేరళ మోడల్ సక్సెస్

Update: 2020-07-09 15:43 GMT
కరోనా వైరస్ మొదట బయటపడ్డది కేరళలోనే. అలాంటిది ఇప్పుడు కరోనాను పూర్తిగా కంట్రోల్ చేసి దేశానికి మోడల్ గా నిలించింది కేరళ రాష్ట్రం. కేరళ తీసుకున్న చర్యలు అన్ని రాష్ట్రాలు అవలంభిస్తున్నాయి.

కేరళలో ప్రభుత్వం, పోలీసులు, అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేసి కరోనాను అదుపులోకి తెచ్చారు. ఇప్పుడు కేరళలోనే తిరువనంతపురంలోని ఓ తీర ప్రాంత పూంతూర్ గ్రామంలో కరోనా బాగా ప్రబలింది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలో సూపర్ స్పైడర్లతో తొలి క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో 25 మంది కమాండోలను బుధవారం మోహరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే కమాండోల సాయంతో అంబులెన్స్ లో ఎక్కించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.

పూంతూర్ గ్రామంలో ఒక చేపల వ్యాపారి కారణంగా 150మందికి కరోనా సోకడంతో అక్కడికి కమాండోలను దించింది కేరళ సర్కార్. పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తూ పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇలా కేరళలో కరోనాను విజయవంతంగా నియంత్రిస్తున్నారు.


Tags:    

Similar News