కేరళ గోల్డ్ స్కాంలో ఎన్ఐఏ సంచలన నిజాలు?

Update: 2020-10-15 11:50 GMT
కేరళ గోల్డ్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి సీఎం కార్యాలయ అధికారుల తోడ్పాటుతో భారీగా స్మగ్లింగ్ జరిగినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. కేరళ సీఎంవో సాక్షిగా ఈ దందా వెలుగుచూడడం సంచలనమైంది.

అయితే తాజాగా ఈ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉందా? అంటే ఔననే అంటున్నారు  ఎన్.ఐ.ఏ అధికారులు. ప్రస్తుతం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతోంది. ఈ మేరకు ఈ కేసులో దావూద్ గ్యాంగ్ హస్తం ఉందని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది.

కేరళ నుంచి బంగారంను స్మగ్లింగ్ చేసి వాటిని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తారని ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో విచారణ సాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపితే పెద్ద తలకాయలు బయటపడే అవకాశాలున్నాయని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.

ఇక ఈ కేసు విచారణలో కీలక విషయం వెలుగుచూసింది. ‘రమీజ్’ అనే వ్యక్తి తనకు టాంజానియాలో వజ్రాల వ్యాపారం ఉందని చెప్పినట్లు ఎన్ఐఏ తెలిపింది. టాంజానియాలోనే దావూద్ సన్నిహితుడు ఫెరోజ్ కు వజ్రాల వ్యాపారం ఉందని.. అది దావూద్ బినామీగా నడిపిస్తున్నాడని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఈ ఫఎరోజ్ దక్షిణ భారత రాష్ట్రానికి చెందిన వాడని.. అందుకే కేరళకు స్మగ్లింగ్ అవుతోందని ఎన్ఐఏ తెలిపింది.
Tags:    

Similar News