ప్ర‌పంచ కేర‌ళీయుల‌కు సీఎం స‌రికొత్త ఐడియా!

Update: 2018-08-27 08:27 GMT
ప్ర‌కృతి అందాల‌తో విరాజిల్లే కేర‌ళ ఒక‌ప్ప‌టిది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ దారుణంగా దెబ్బ తిన్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల కార‌ణంగా దాదాపు రూ.2ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌న్న మాట‌ను ప‌లువురు చెబుతున్నారు.

ప్ర‌కృతి విసిరిన స‌వాలుకు తీవ్రంగా న‌ష్ట‌పోయిన కేర‌ల నిల‌దొక్కుకోవ‌టానికి పెద్ద ఎత్తున సాయం అందాల్సి ఉంది. అయితే.. కేంద్రం నుంచి ఆశించినంత సాయం అంద‌ని దుస్థితి. ఇలాంటి వేళ‌.. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ వినూత్నంగా ఒక విన‌తిని చేశారు.

కేర‌ళ‌ను స‌రికొత్త‌గా నిర్మించుకోవ‌టానికి కేర‌ళ సీఎం కోరిన వైనం ఆస‌క్తిక‌రంగా ఉంది.కొత్త కేర‌ళ‌ను పున‌ర్ నిర్మించుకోవటానికి వీలుగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కేర‌ళీయులు స‌మాయుత్తం కావాల‌ని కోరారు. ఇందుకోసం ఆయ‌న వినూత్న‌రీతిలో ఒక సూచ‌న చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌ల‌యాళీలంతా త‌మ నెల వేత‌నాన్ని సొంత భూమి కోసం సాయంగా ఇవ్వాల‌ని కోరారు. అలా అని ఒక్క‌సారిగా నెల మొత్తం క‌ష్ట‌మ‌య్యే ప‌రిస్థితుల్లో ఆయ‌న ఈఎంఐ ఆఫ‌ర్ ను పెట్టారు.

ప్ర‌తి నెలా మూడురోజుల జీతాన్ని కేర‌ళ పున‌ర్ నిర్మాణానికి సాయంగా అందించాల‌ని కోరారు. ఇలా ప‌ది నెల‌ల పాటు చేసిన ప‌క్షంలో కేర‌ళ‌ను త‌మ‌కు తాముగా పున‌ర్ నిర్మించుకోవ‌టానికి సాధ్య‌మ‌వుతుంద‌ని.. అదేస‌మ‌యంలో ప్ర‌తి ఒక్క కేర‌ళీయుడి మీద‌పెద్ద‌గా ప్ర‌భావం పడ‌ద‌న్నారు. నిజ‌మే.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కేర‌ళీయులంతా ప్ర‌తి నెల మూడు రోజుల జీతాన్ని కేర‌ళ స‌హాయ‌నిధికి పంపితే..కేర‌ళ‌ను ఎవ‌రో ఏదో చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కేర‌ళీయులు తమ సొంత డ‌బ్బుతోనే త‌మ కేర‌ళ‌ను త‌మ‌కు త‌గిన‌ట్లుగా తీర్చిదిద్దుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News