దుర్గమ్మ మొక్కే మిగిలనుంది?

Update: 2017-02-24 04:57 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు తీరుస్తానంటూ పలు దేవుళ్లకు మొక్కుకున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొక్కులు తీర్చే పనిలో కాస్త ఆలస్యం చేశారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొక్కులు తీర్చటం పెద్ద విషయం కాదు. ఎందుకు ఆలస్యమైందన్న విషయాన్ని పక్కన పెడితే.. తన మొక్కులు తీర్చే ప్రోగ్రాంను ఆయనీ మధ్య వేగవంతం చేశారు.

ఇటీవల వరంగల్ భద్రకాళి అమ్మ వారికి మొక్కు చెల్లించుకున్న ఆయన.. రీసెంట్ గా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని.. ఆయనకు చెల్లించాల్సిన మొక్కును చెల్లించుకోవటంతో పాటు.. తిరుచానూరు అమ్మవారి మొక్కును తీర్చేయటం తెలిసిందే. తిరుమల పర్యటనను ముగించుకొచ్చిన కేసీఆర్.. మహాశివరాత్రి  పర్వదినాన్ని పురస్కరించుకొని.. తన తదుపరి మొక్కును తీర్చుకుంటున్నారు.

ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి మొక్కును తీర్చుకోనున్నారు.  స్వామి వారికి బంగారు మీసాలు సమర్పించనున్నారు. ఈ రోజు ఉదయం బేగంపేట నుంచి హెలికాఫ్టర్ లో మేడ్చల్ జిల్లాలోని కీసర రామలింగేశ్వరస్వామిని దర్శించుకోనున్న ఆయన.. తర్వాత వీరభద్రస్వామిని దర్శించుకొని బంగారు మీసాలు సర్పించనున్నారు. ఇక.. కేసీఆర్ మొక్కుల్లో మిగిలింది బెజవాడ అమ్మవారిది మాత్రమే. త్వరలోనే.. విజయవాడకు వెళ్లి.. అమ్మవారి మొక్కు తీర్చుకోవాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశించారు. చివరి మొక్కును కేసీఆర్ ఎప్పుడు తీర్చుకుంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News