కేసీఆర్ లో ‘ఉద్యమ’ నేత నిద్ర లేచారా?
అవసరం మనిషి చేత ఏ పనైనా చేయిస్తుందని అంటారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏమీ మినహాయింపు కాదు. అంతా అనుకూలంగా ఉండి.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం కోసం ఆయన ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమవుతారు. అదే సమయంలో.. ఆయన ఏదైనా విషయంలో ఒకసారి డిసైడ్ అయ్యారంటే చాలు.. ఎలాంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకునే టాలెంట్ ఆయన సొంతం. గ్రేటర్ ఎన్నికలకు ముందు కేంద్రంతో ఢీ కొట్టే విషయంలో వెనుకా.. ముందు అన్నట్లుగా ఆలోచనలు సాగేవి.
ఎప్పుడైతే గ్రేటర్ ఎన్నికల్లో ఆయన పార్టీకి బీజేపీ దెబ్బ పడిందో.. అంతే.. ఆయనలోని పోరాట యోథుడు ఒక్కసారిగా నిద్ర లేచారు. తమదే ప్రభుత్వమన్న విషయాన్ని వదిలేసి.. అధికార పక్షంలో ఉండి కూడా విపక్షాలు పిలుపును ఇచ్చిన భారత్ బంద్ కు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటించటమే కాదు.. పార్టీ నేతలంతా కూడా మిస్ కాకుండా ఆందోళనలో చేపట్టాలని కోరారు.
ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. తాను అధికారంలో ఉన్నఆరేళ్ల కాలంలో ఒక్కసారికి కూడా నిరసన.. ఆందోళన చేపట్టామన్న మాట వినిపిస్తే చాలు.. దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలన్న తీరుపై బోలెడన్ని ప్లాన్లు చేయటమే కాదు.. తాను చెప్పినట్లే జరుగుతున్నాయా? లేదా? అనేది చెక్ చేసుకునే వారు. ఉద్యమ నాయకుల్ని.. విద్యార్తి నేతలు ఎవరైనా సరే.. ఏదైనా సమస్యలపై గళం విప్పితే చాలు.. అనుమతులు ఏవంటూ పోలీసులు ప్రశ్నించేవారు. ఉద్యమాలు.. నిరసనలు. ఆందోళనలు లాంటివి తెలంగాణలో చేసేందుకు అవకాశమే ఉండేది కాదు.
అలాంటిది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఆందోళన చేయాలని పిలుపును ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. ఢిల్లీ శివారులో రైతులంతా గడిచిన పదకొండు రోజులుగా ఆందోళన చేస్తున్న వేళ.. వారికి మద్దతు ఇవ్వటం కోసం దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ను ప్రకటించారు. ఈ బంద్ ను అధికారపక్ష అధినేతే భారత్ బంద్ ను సక్సెస్ చేయాలని కోరుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇన్నాళ్ల తర్వాత ముఖ్యమంత్రి నోటి నుంచి ఓకే చెప్పటమే కాదు.. తనలో నిద్రపోతున్న ఉద్యమ నేత నిద్ర లేపారని చెప్పక తప్పదు. గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం ఆయన మర్చిపోయిన భావోద్వేగ ఆయుధాన్ని తట్టి లేపిందని చెప్పక తప్పదు.