సీఎం సెక్యూరిటీ అధికారి తపాకి మిస్ ఫైర్?

Update: 2016-07-29 09:42 GMT
ప్రభుత్వ.. పోలీసు వర్గాల్లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం మీద సందేహాలు ఎన్నో. ముఖ్యమంత్రి భద్రతాధికారింగా ఉన్న ఒక అధికారి తుపాకీ మిస్ ఫైర్ అయి మరణించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన తుపాకిని శుభ్రం చేసుకునే క్రమంలో మిస్ ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన అధికారిని వాసుదేవ రెడ్డి గా చెబుతున్నారు.

మిస్ ఫైర్ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించినట్లుగా చెబుతున్నా.. ఈ వార్త మాత్రం మీడియాలో రాకపోవటం గమనార్హం. ఈ ఘటన కచ్ఛితంగా ఎప్పుడు జరిగిందన్న విషయంలోనూ కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉండటం గమనార్హం. గురువారమే జరిగిందని చెబుతున్న ఈ ఘటన గురించి మీడియాలో ఫోకస్ కాలేదు. ఒకట్రెండు మీడియా సంస్థల్లో ఈ వార్తను రిపోర్ట్ చేసినా.. వివరాలు పూర్తిగా వెల్లడించకపోవటం గమనార్హం.

మిస్ ఫైర్ ఘటనలో ఇద్దరు పోలీసులు సైతం గాయపడినట్లు చెబుతున్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయినా.. సీఎం స్థాయి వ్యక్తికి భద్రతాధికారిగా ఉండే ఆఫీసర్ తన తుపాకీ పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. శుభ్రం చేసుకోవాలనుకుంటే  బుల్లెట్లు తీసి క్లీన్ చేసుకుంటారే కానీ.. బుల్లెట్లు ఉంచుకొని చేయరు కదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతంలో ప్రశ్నలే కానీ.. సమాధానాలు లభించని పరిస్థితి. ఈ విషయం మీద పలువురు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు కొందరు అవునని.. మరికొందరు కన్ఫర్మ్ చేయలేమని చెప్పటం గమనార్హం. అసలీ ఉదంతం గురించి వివరాల్ని అధికారికంగా పోలీసు శాఖ వెల్లడిస్తే బాగుంటుందన్నఅభిప్రాయం ఉంది.
Tags:    

Similar News