తెలంగాణలో గెలుపు నిర్ణయించేది వీళ్లే!

Update: 2018-10-14 10:15 GMT
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయావకాశాలపై హాట్ కామెంట్ చేశారు. తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకుంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని.. తనకు ఈ విషయంలో గట్టి నమ్మకముందని అసదుద్దీన్ తాజాగా స్పష్టం చేశారు.

నిజానికి ఈ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. కానీ తెరవెనుక ఎంఐఎంతో మంచి దోస్తీని మెయింటేన్ చేస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎంఐఎంతో ఫ్రెండ్లీ పోటీని పెట్టుకుంటూ వారు పోటీచేసే స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. ఒకవేళ పోటీచేయించినా బలహీన అభ్యర్థులనే దింపుతున్నారట.. ఎంఐఎం ఓవైసీతో కేసీఆర్, కేటీఆర్  ఇటీవలే రహస్య సమావేశం నిర్వహించి మరీ ఈ అవగాహనకు వచ్చినట్టు వార్తలొచ్చాయి.

కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు పడకుండా టీఆర్ఎస్ కే పడేలా వీరి మధ్య తెరవెనుక ఒప్పందం జరిగినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12శాతం మంది ముస్లింలున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 50 సీట్లలో వీరు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అందుకే కేసీఆర్ ఎంఐఎంతో దోస్తీకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 సీట్లున్నాయి. ఇందులో ఎంఐఎం ఘననీయమైన ప్రభావం చూపుతుంది. ఈ సీట్లలో 7 ఎంఐఎంకు పోగా మిగతా ముస్లింల ఓట్లన్నీ టీఆర్ఎస్ కు పడేలా తెరవెనుక  రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

తాజాగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని అసదుద్దీన్ చెప్పడంతో ఆ పార్టీ మద్దతు టీఆర్ఎస్ కే అని స్పష్టమవుతోంది. దీంతో కాంగ్రెస్ కు ముస్లిం ఓట్లు పడవని నిర్ధారణ అవుతోంది. ఈ పరిణామం అధికార టీఆర్ఎస్ కు గొప్ప ఊరట కాగా.. ప్రతిపక్షాలకు శరాఘాతంగా మారింది.
Tags:    

Similar News