బాబు మోహన్ కు కేసీఆర్ షాకిచ్చారా.?

Update: 2018-07-23 16:33 GMT
సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన పలు సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేలు వచ్చే సారి గెలవరని రిపోర్టు వచ్చింది. మళ్లీ గెలవని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికల్లో టికెట్లు కష్టమని టీఆర్ ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. గడిచిన 2014 ఎన్నికల్లో ఆంథోల్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఏపీ డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర రాజనర్సింహను ఓడించి సినీ నటుడు బాబు మోహన్ సంచలనం సృష్టించాడు. కానీ ఈసారి బాబు మోహన్ కు అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు సర్వేల్లో తేలిందట.. మళ్లీ గెలవడం కష్టమని టీఆర్ ఎస్ సర్వేల్లో బయటపడిందని  వార్తలు లీకయ్యాయి.. టీఆర్ ఎస్ నుంచి మళ్లీ గెలవని 40 మందికిపైగా ఎమ్మెల్యేల్లో బాబు మోహన్  కూడా ఒకరనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన ప్రత్యామ్మాయాలను వెతుక్కుంటున్నారని తాజాగా స్పష్టమైంది.

సీఎం కేసీఆర్ పట్టుదల గా ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ పదవులు లేదా ఏదైనా కార్పొరేషన్ పదవులు ఇచ్చి గెలుపు గుర్రాలనే దించడానికి యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంథోల్ లో మళ్లీ దామోదర రాజనర్సింహను ఎదుర్కోవడం బాబు తరం కాదనే ప్రచారం జరుగుతోంది. పైగా బాబు మోహన్ ఇటీవల అక్కడ స్థానికులను తిట్టిన పలు వీడియోలు కూడా ఆయనపై ప్రజల్లో ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. అందుకే సీటు దక్కడం అనుమానమని తెలిసి బాబు మోహన్ మళ్లీ  సినిమాల వైపు దృష్టిసారించారనే ప్రచారం జరుగుతోంది.

సీనియర్ దర్శకుడు తనకు బాగా తెలిసిన కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో బాబు మోహన్ తాజాగా ‘బిచ్చగాడా.. మజాకా’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కథ మొత్తం దాదాపు మోహన్ బాబు చుట్టూనే తిరుగుతుందట.. బాబు మోహన్ పాత సినిమాల్లో హిట్ అయ్యింది బిచ్చగాడి పాత్రలతోనే.. మళ్లీ కేఎస్ నాగేశ్వరరావు అదే గెటప్ ను బాబు మోహన్ కు ఇచ్చాడు. అందులో ఫుల్ కామెడీని పండించాడట.. ఈ సినిమాలో బాబుమోహన్ తో ఓ పాటకు చిందులు వేయించడంతోపాటు స్వయంగా ఓ పాట కూడా పాడించాడట.. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బాబు మోహన్ చేసిన ఒకే ఒక్క సినిమా ఇదే కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలంతా వచ్చ ఎన్నికల్లో నెగ్గడానికి ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతుంటే.. బాబు మోహన్ మాత్రం ఇలా సినిమా చేయడం చర్చనీయాంశమైంది. అంటే ఈసారి బాబు మోహన్ కు టిక్కెట్ దక్కే అవకాశం లేదా.? అందుకే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారా అన్న సందేహాలు మొదలయ్యాయి.
Tags:    

Similar News