వెనక్కి తగ్గని కేసీఆర్..ఆర్టీసీ ఇక కాలగమనంలో కలిసిపోబోతుందా..
నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి ..అన్నట్టుగా సాగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి పాలన. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు సీఎం చెప్పిన మాటలకే అందరూ తలా ఉపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగారు తెలంగాణ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన సీఎం కేసీఆర్ ..అసలు బంగారు తెలంగాణ కాదు కదా తెలంగాణ నైనా బ్రతకనిస్తారా అని అనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ వారు చేస్తున్న సమ్మె 28 రోజులకి చేరింది. కానీ , సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ 28 రోజుల నుండి ప్రజలు పడుతున్న కష్టాలు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉన్న కేసీఆర్ కి ఎలా తెలుస్తుంది అని ప్రజలు సీఎం పై మండిపడుతున్నారు.
ఎదో తాత్కాలికంగా కొన్ని బస్సులని నడుపుతున్నా కూడా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. అలాగే హైకోర్టు నుండి అక్షింతలు పడ్డా కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపే బదులు - ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా సమ్మె - ఆర్టీసీ భవిష్యత్తుపై రేపు కీలక సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ఆర్టీసీపై ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని సమాచారం.
తాజా ఆలోచన ప్రకారం - ఆర్టీసీలో 50శాతం యాజమాన్య బస్సులు - 30శాతం అద్దె బస్సులు - 20శాతం ప్రైవేటు స్టేజి క్యారియర్లు ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ప్రైవేట్ స్టేజి క్యారియర్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఆర్టీసీలో 20శాతం ప్రైవేటీకరణ పూర్తయినట్టే. ఒక్క సంతకం పెడితే - వందలాది ప్రైవేటు బస్సులు రోడ్లపైకి వస్తాయని కేసీఆర్ గతంలో బెదిరించారు. ఇప్పుడు అదే జరగబోతుంది.
తాము అనుమతించిన 21 డిమాండ్లపై చర్చకు కార్మిక సంఘాలు వచ్చి ఉంటే, అదే ఊపులో విలీనంపై కూడా సానుకూలంగా ఓ నిర్ణయం తీసుకొని ఉండేవాడినని - కార్మిక సంఘాలు కేవలం విలీనం అని మాత్రమే పట్టుకొని కూర్చోవడంతో తను కూడా వెనక్కితగ్గడం లేదని కొంతమంది మంత్రుల వద్ద కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈరోజు మరోసారి ఈ సమస్యపై హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఈరోజు కోర్టులో జరిగే వాదనలు విన్న తర్వాత, ప్రైవేటు బస్సుల అనుమతిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఏదేమైనా కూడా సీఎం కేసీఆర్ మాత్రం తన మాటలకే కట్టుబడి ఉన్నారు అని మాత్రం అర్థమౌతుంది. దీనితో సుమారు 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థంకావడంలేదు.