తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ మరో అద్భుత పథకం

Update: 2019-01-20 11:45 GMT
పథకాల రూపకల్పన, అవి పేద ప్రజలకు అందేలా చేయడంలో కేసీఆర్‌ మార్క్‌ ప్రత్యేకంగా కన్పిస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా తన పథకాలు అందరికి ఉపయోగపడాలని ఆయన కోరుకుంటారు. అందుకే.. కంటివెలుగు అనే అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.32 కోట్ల మంది ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరం అయితే.. కంటి అద్దాలు ఇవ్వడంతో పాటు.. సర్జరీలు కూడా చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ప్రకటించారు కేసీఆర్‌.

కంటి వెలుగు పథకం ప్రయోజనాలు అందరూ పొందిన తర్వాత.. రాబోయే రోజుల్లో ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు కేసీఆర్‌. ఆరోగ్యం విషయంలో ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఈ సందర్భంగా అన్నారు. మరోవైపు… ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భవ పథకం కంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అద్భుతంగా ఉందని.. అందువల్లే ఆయుష్మాన్‌ భవ పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామి కాలేదని చెప్పారు కేసీఆర్‌.
Tags:    

Similar News