అబ్బ..ఏం సెప్తిరి ఏం సెప్తిరి...

Update: 2015-05-23 04:07 GMT
స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో గత వారం రోజులగా హైదరాబాద్ అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో కలియతిరగడం..అడిగిందీ..అడగండి అన్నీ ప్రకటించడం వరుసగా జరుగుతూనే ఉన్నాయి. పనిలో పనిగా తానెంత మంచివారో కూడా కేసీఆర్ చెప్పుకొంటున్నారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయాలు సందర్భానుసారం, తనకోసం మాట్లాడేవి కావడంతోనే వచ్చిపడింది అసలు చిక్కు.

స్వచ్ఛ హైదరాబాద్ జరిగిన తీరుపై సీఎం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీరియస్ అయ్యారు. నగరంలో ప్రతి ప్రాంతంలోనూ గోడలపైనా, మెట్రో పిల్లర్లపైనా తనవి, టీఆర్‌ఎస్‌ నేతలవి పోస్టర్లు అంటిస్తుండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నగరంలో తనతోపాటు ఎవరి పోస్టర్లూ గోడలపై కనిపించరాదని, ప్రస్తుతం ఉన్న వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇతర పార్టీలవారికీ ఈమేరకు విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించడం వల్ల వాటి అందం చెడిపోతోందని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలపడంతో సీఎం ఇలా స్పందించినట్టు సమాచారం.

అయితే సరిగ్గా నెల కింద టీఆర్ఎస్ ప్లీనరి, బహిరంగ సభ జరిగినపుడు నగరం మొత్తం గులాబీమయం అయింది. అనుమతి ఉన్న చోట తక్కువ ప్రచారం చేసుకొని గోడలు, రహదారులు....అన్నీ నింపేశారు. ఇపుడు కేసీఆర్ స్పందించడం వెనక మర్మం... స్వచ్ఛ హైదరాబాద్ ను సొంత పార్టీ ఉల్లంఘిస్తోందని విమర్శలు వస్తాయనే భయమే కావచ్చు!!
Tags:    

Similar News