• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నమ్మినవాడే ముంచాడా?...

నమ్మినవాడే ముంచాడా? కామారెడ్డి తల్లీ కుమారుల విషాదం వెనుక అసలు కథ?

By - Tupaki Desk
Update: 2022-04-16 16:30 GMT
కామరెడ్డి జిల్లాలో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో లాడ్జి సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా  డీఎస్పీ సోమనాథం, సీఐ నరేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గదిలో రెండు మృతదేహాలు లభించగా, అవి తల్లీ కుమారులవని, వారు మెదక్ జిల్లాకు చెందిన వారని గుర్తించారు. అయితే వీరి మరణం తెలిసిన మృతుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రాథమిక దర్యాప్తు మేరకు వీరి ఆత్మహత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా చనిపోయే ముందు మృతుల్లో ఒకరు వీడియో తీసి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించడంతో వీరి మరణం వెనుక షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన పద్మ ఆమె కుమారుడు సంతోష్ కామారెడ్డి లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డారు.  సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. తనపై కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులు ఓ ఫేస్ బుక్ పోస్టు విషయమే ఒత్తిడి తెచ్చారని, ఈ వేధింపులు తట్టుకోలేకే తల్లి కుమారులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈనెల 11న తల్లితో కామారెడ్డి చేరుకున్న సంతోష్ స్థానికంగా ఉన్న శ్రీ కాళభైరవస్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత శనివారం ఉదయం లాడ్జిలోనే నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఆత్మహత్య చేసుకునే ముందు సంతోష్ ఓ వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియోలో ‘నేను బాసం శ్రీను అనే వ్యక్తితో కలిసి వ్యాపారం చేశాను. అయితే శ్రీను దగ్గర డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన లాభంలో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ అలా కుదరదని చెప్పా. అయితే నాపై కక్ఫ కట్టి ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్టుపై  నన్ను ఇరికించాలని చూశారు. దీంతో నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కేసు పెట్టించేందుకు ప్రయత్నించారు. అయితే మెదక్ ఎస్పీని కలిసిన తరువాత ఆ అంశంలో నాకు సంబంధం లేదన్నారు. అయితే అప్పటి వరకు నా ఫోన్ ను లాక్కున్న వారు అందులో ఉన్న సమాచారం అంతా దొంగిలించారు. ’ అంటూ బాధితుడు సంతోష్ అసలు నిజాలు వెల్లడించారు.

‘ఆ సమాచారం ఆధారంగా నన్ను వేధింపులకు గురి చేశారని... నన్ను బెదిరిస్తున్నారని’ సంతోష్ వాపోయాడు. ఈ విషయం పోలీసులకు చెప్పాని.. దాంతో నా వ్యాపారాన్ని సాగనీయలేదన్నారు. ‘అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. మానసికంగా ఇబ్బంది పెట్టారు. నమ్మిన స్నేహితుడే ఇలా చేసే సరికి తట్టుకోలేకపోయా. అందుకే ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సంతోష్ వీడియోలో చిత్రీకరించారు. దీంతో ఆర్థిక వ్యవహారాలే ఈ తల్లీకూతుళ్ల ఆత్మహత్యకు కారణాలని.. వ్యాపారంలో ఇబ్బందులు.. పర్సనల్ విషయాల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags:    
  • Kamareddy 
  • telangana 
  • mother 
  • son 
  • suicide 
  • relatives 
  • telugunews 
  • tupakinews 
  • latestupdate 

Similar News

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

తుఫాన్ విపత్తుల అసలు లింకు ఎక్కడ ఉందో తెలుసా?

2026-11-17 10:31 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

రాహుల్ మనసులో మాట.. ఎవరా లక్కీ గర్ల్? నెట్టింట మొదలైన వేట!

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

2026-11-17 10:02 GMT

100 మంది బౌన్సర్లు.. కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఈ గుర్రం రాచరికం వెనుక అసలు కథ

2026-11-17 10:01 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

1.8 లక్షల మంది కోరుతున్నా.. జెన్సన్ హువాంగ్‌ను వెనక్కి తీసుకోని ఎన్విడియా!

2026-11-17 10:01 GMT

యూట్యూబర్ ను సెల్ఫీ పేరుతో దగ్గరకొచ్చి ఏకంగా 'లిప్ కిస్' అడిగాడు.. తర్వాత చూడాలి..

2026-11-17 06:51 GMT

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

Copyright @2026

Powered by Blink CMS