అబ్బే.. స్టార్ హీరో ఎన్నికల్లో పోటీ చేయడం లేదు!

Update: 2019-03-25 11:24 GMT
కొన్నాళ్ల కిందట రాజకీయ పార్టీని పెట్టిన నటుడు కమల్ హాసన్.. ఈ ఎన్నికల్లో తన పార్టీని బరిలో నిలుపుతూ ఉన్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యం.. అంటూ కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని పెట్టాడు. ఒకవైపు రజనీకాంత్ రాజకీయం విషయంలో వెనుకా ముందు ఆలోచించుకుంటూ ఉంటే కమల్ హాసన్ మాత్రం తన పార్టీని ఎన్నికల బరిలోకి దింపేశాడు. వివిధ నియోజకవర్గాలకు కమల్ తన అభ్యర్థులను ప్రకటించేశాడు.

తాజాగా మెనిఫెస్టోని కూడా విడుదల చేశాడు కమల్ హాసన్. లోక్ సభ ఎన్నికల్లో తమిళనాట రాజకీయ పార్టీలన్నీ.. ఏదో ఒక కూటమిగా రంగంలోకి దిగుతుంటే కమల్ హాసన్ మాత్రం ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా సోలోగా పోటీ చేస్తూ ఉన్నాడు. తమిళనాట అన్ని ఎంపీ సీట్లలోనూ కమల్ హాసన్ అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. లోక్ సభ ఎన్నికలతోనే కమల్ అమీతుమీ తేల్చుకోబోతున్నారు.

ఇంత వరకూ బాగానే ఉంది కానీ..తను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదట కమల్ హాసన్. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాట కమల్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటున్నా.. కమల్ హాసన్ మాత్రం ఎక్కడ నుంచి కూడా పోటీ చేయడం లేదట. ఈ విషయాన్ని మక్కల్ నీది మయ్యం ప్రకటించింది.

కమల్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉండటం లేదని - ఎంపీగా పోటీ చేయడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇలా తను ఎంపీగా పోటీ చేయడం విషయంలో కమల్ హాసన్ వెనుకడుగు వేశాడు. ఇక సినిమాలను లైట్ తీసుకుంటున్నట్టుగా, రాజకీయాల మీదే దృష్టి అని కమల్ ప్రకటించాడు. అయితే.. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకపోవడం మాత్రం గమనార్హం!
Tags:    

Similar News