ఓటమి అనంతరం కోహ్లీకి జర్నలిస్టు షాకింగ్ ప్రశ్న.. తలదించుకున్న కోహ్లీ..

Update: 2021-10-25 05:21 GMT
ప్రపంచకప్ లలో ఇంతవరకూ పాకిస్తాన్ చేతిలో ఓటమి ఎరుగని టీమిండియా నిన్న రాత్రి దారుణంగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఈ దారుణ పరాభావాన్ని చవిచూసింది. దేశ క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకూ ఏ కెప్టెన్ కూడా ఇలా ఓడిపోలేదు. ఆ దురదృష్టం కోహ్లీని వెంటాడింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో చిత్తయ్యింది. బాబార్ అజామ్ సారథ్యంలోని పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్ కు ముందు భారత్, పాక్ లు వన్డే, టీ20 ప్రపంచకప్ లో మొత్తం 12 సార్లు తలపడ్డాయి. కానీ పాకిస్తాన్ గెలవలేకపోయింది. మొదటిసారిగా టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఖాతా తెరిచింది. ఈ ఓటమిని టీమిండియాను కుదిపేస్తోంది.

ఈ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విలేకరుల సమావేశానికి వెళ్లారు. అక్కడ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తలదించుకున్నాడు. కోపంతో తల పట్టుకొని పక్కకు తింపాడు. జట్టు ఎంపిక గురించి ఆ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.
Read more!

ఈ ప్రశ్న వేయగానే మొదట కోపం తెచ్చుకున్న కోహ్లీ తర్వాత నవ్వుతూ తలపట్టుకున్నారు. ప్లేయింగ్ 11లో రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ కు చోటు ఎందుకు ఇవ్వలేదని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. కోహ్లీ విరుచుకుపడ్డారు.

ఆ జర్నలిస్ట్ ను అవహేళనగా చూస్తూ ‘ఇది తెలివైన ధైర్యమైన ప్రశ్న.. మీరు ఏమనుకుంటున్నారు సార్. నేను అత్యుత్తమంగా భావించిన జట్టుతో క్రికెట్ ఆడాను. టీ20 అంతర్జాతీయ జట్టు నుంచి మీరు రోహిత్ శర్మను తొలగించగలరా? గత మ్యాచ్ లో అతడు ఎలా ఆడాడో మీకు తెలుసు కదా’ అని సమాధానమిచ్చాడు.

అనంతరం పాకిస్తాన్ తమకంటే బాగా ఆడిందని.. తమ వ్యూహాలు సరిగ్గా అమలు చేయలేకపోయామని కోహ్లీ తప్పు ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ తో తమకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేసింది.


Tags:    

Similar News